ASTOTTARA SATAKUNDATMAKA HOMAM AT SKVST_ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభ‌వంగా అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం

Srinivasa Mangapuram, 17 Oct. 19: The religious ritual of Astottara Satakundatmaka Srinivasa Maha Yagam was observed in ceremonious manner in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Thursday. 

The Pradhana Kankana Bhattar Sri Sitaramacahryulu performed the day rituals which included Snapana Tirumanjanam and Yagashala activities. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభ‌వంగా అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం

తిరుపతి, 2019 అక్టోబరు 17:  శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  రెండ‌వ రోజైన గురువారం అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంలో వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

 ఇందులో భాగంగా గురువారం ఉదయం 9.00 గంల‌కు ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ సీతారామాచార్యులు  ఆధ్వ‌ర్యంలో కుంభ‌రాధ‌న, గో పూజ, ఉక్త హోమాలు నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కోబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చంద‌నంల‌తో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.
 
కాగా, అక్టోబరు 18న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గజపూజ, పూర్ణాహుతితో మహాయాగం ముగుస్తుంది.

ఈ కార్యక్రమంలో  వైఖానస ఆగమ సలహదారులు శ్రీ సుందరవరద బట్ట‌చార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీ అనంతశయన‌ దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ యలప్ప, ఏఈవో శ్రీ  ధనంజయులు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.