SRIVARI NAVANEET SEVA BEGINS_ శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం

TTD EO & CHAIRMAN LEAD NAVANEETAM PROCESSION

Tirumala, 30 August 2021: On the auspicious occasion of Sri Krishna Janmashtami, TTD launched the unique Navaneeta Seva on Monday.

 

As part of the festivities, the butter vessel were carried from Goshala by the TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy along with the Srivari Sevakulu in a procession and handed over to the Archakas at Srivari temple.

 

Speaking to media persons later, the TTD Chairman said the milk from desi Gir cows is used to make curd and through conventional methods churned into butter for use in the Navaneeta Seva.

 

He said the butter will be daily brought to the Srivari temple from the Goshala in a procession to be used in the ritual and Srivari Sevakulu will render service as processional carriers.

 

Earlier the Tirumala pontiff’s Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyarswamy along with TTD Chairman and EO reviewed the butter churning exercise at the Goshala decorated for the event richly with rangoli and flowers.

 

TTD EO DONATES SILVER VESSEL

 

TTD EO presented a 1.12 kg silver vessel to carry the Navaneeta on the occasion.

 

PROCESSION HIGHLIGHTS

 

The highlight of the Navaneeta Seva procession by Srivari Sevakulu and the artists performing kolatam, bhajans and children dressed as Chinni Krishna and Gopikas.

 

Additional EO Sri AV Dharma Reddy CVSO Sri Gopinath Jatti, Goshala Director Dr Harnath Reddy, DyEOs Sri Ramesh Babu, Sri Harindranath, Sri Vijaya Saradhi, Sri Lokanatham, Sri Bhaskar, VGO Sri Bali Reddy, TTD board ex member Sri Siva kumar, AVSOs Sri Pavan, Sri Gangaraju, Sri Surendra and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం

వెన్న ఊరేగింపులో పాల్గొన్న టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో

తిరుమ‌ల‌, 30 ఆగస్టు 2021: శ్రీ‌కృష్ణాష్టమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవ సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకుని అర్చ‌కుల‌కు అంద‌జేశారు.

అనంత‌రం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప‌విత్ర‌మైన కృష్ణాష్ట‌మి ప‌ర్వ‌దినం రోజున న‌వ‌నీత సేవ‌ను ప్రారంభించుకోవ‌డం మ‌నంద‌రి అదృష్ట‌మ‌న్నారు. క‌లియుగం ఉన్నంత‌కాలం ఈ సేవ కొన‌సాగుతుంద‌న్నారు. ఇందుకోసం గోశాల‌లో దేశవాళీ గోవుల పాల‌తో పెరుగు త‌యారుచేసి, దాన్ని సంప్ర‌దాయబద్ధంగా క‌వ్వాల‌తో చిలికి వెన్న తీస్తార‌ని చెప్పారు. ఈ వెన్న‌ను ప్ర‌తిరోజూ గోశాల నుండి ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద‌కు తీసుకొచ్చి అర్చ‌కుల‌కు అంద‌జేస్తార‌ని వివ‌రించారు. అర్చ‌కులు వెన్న‌ను స్వీక‌రించి శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు వినియోగిస్తార‌ని తెలిపారు. వెన్న త‌యారీ, వెన్న ఊరేగింపులో శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొంటార‌ని వివ‌రించారు.

ముందుగా శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఛైర్మ‌న్‌, ఈవో వెన్న త‌యారీని ప‌రిశీలించారు. క‌వ్వంతో కుండ‌లోని పెరుగును చిలికారు. ఈ సంద‌ర్భంగా గోశాల ప్రాంగ‌ణాన్ని రంగ‌వ‌ళ్లులు, పుష్పాల‌తో అలంక‌రించారు.

వెండి గిన్నె బ‌హూక‌రించిన ఈవో

న‌వ‌నీత సేవ‌లో వెన్న తీసుకెళ్లి స్వామివారికి స‌మ‌ర్పించేందుకు గాను 1 కిలో 12 గ్రాముల బ‌రువు గ‌ల వెండి గిన్నెను టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి విరాళంగా అంద‌జేశారు.

ఆక‌ట్టుకున్న చిన్నికృష్ణులు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌

న‌వ‌నీత సేవ ఊరేగింపులో చిన్నికృష్ణులు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌లో చిన్నారులు ఆక‌ట్టుకున్నారు. కోలాటం క‌ళాకారులు కృష్ణుని భ‌జ‌న పాట‌లు ఆల‌పిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ విజ‌య‌సార‌థి, శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్, విజిఓ శ్రీ బాలిరెడ్డి, టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, ఎవిఎస్వోలు శ్రీ ప‌వ‌న్‌, శ్రీ గంగ‌రాజు, శ్రీ సురేంద్ర‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.