SERVING NITYA ANNAPRASADAM FOR DEVOTEES AT TIRUMALA IAS AN EVERLASTING SEVA _ నిత్యాన్నదానం నిరంతరం కొనసాగుతుంది

Tirupati, 30 Aug. 21: Serving Nitya Annaprasadam for devotees at Tirumala is an everlasting Seva asserted TTD Chairman Sri YV Subba Reddy. He also warned that all the perpetrators of the misinformation campaign will face legal action soon.

After participating in the Gokulastami celebrations at SV Goshala in Tirupati, the TTD chairman told reporters that all-out efforts were made to gather butter from desi cows and also cow based organic products for the Navaneeta Seva and also Srivari organic naivedyam prasadam which commenced from May 1 onwards.

TTD Chairman sought blessings to the TTD board and the officials to tackle the challenges in executing both the unique programs of Navaneeta seva and Srivari Naivedyam with cow-based products.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నిత్యాన్నదానం నిరంతరం కొనసాగుతుంది
– టీటీడీ పై దుష్ప్రచారం చేసే వారిపై కేసులు తప్పవు
– టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 30 ఆగస్టు 2021: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

టీటీడీ గోశాలలో సోమవారం గోకులాష్టమి గోపూజ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవారికి నిత్యం జరిగే నవనీత సేవ కోసం దేశవాళీ ఆవుల నుంచి వెన్న సేకరించేందుకు నవనీత సేవ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో శ్రీవారికి నిత్యం సమర్పించే ప్రసాదాలను తయారు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. మే 1 వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగే ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం పాలకమండలి కి, అధికారులకు అవసరమైన శక్తి ఇవ్వాలని స్వామి వారిని ప్రార్థించినట్లు శ్రీ సుబ్బారెడ్డి వివరించారు. గోఆధారిత ఉత్పత్తులతో తయారు చేసిన సాంప్రదాయ భోజనం అందించాలని అధికారుల చేసిన చేశారని, దీన్ని నిలిపి వేస్తున్నామని ఆయన తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది