ADHYAYANOTSAVAM COMMENCES AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

· JEEYANGARS TO LEAD PARAYANAM OF DIVYA ALWAR PRABANDHAMS FOR 25 DAYS

 

· ADHYAYANOTSAVAMS IS IN PRACTICE SINCE 1360 IN SRIVARI TEMPLE

 

Tirumala, 2 Jan. 22: As per traditional practice during the auspicious Dhanurmasam, the annual festival Adhyayanotsavam, has commenced at Srivari temple on Sunday evening on a religious note. This unique 25-day long festival will conclude on January 26.

 

Adhyayanotsavams is normally practised by the Srivaishana Jeeyangars 11 days ahead of Vaikunta Ekadasi with the parayanam of Divya Prabandam composed by 12 Alwars every year in the Srivari Temple. For 25 days the 4000 couplets of Divya Prabandam will be recited at the Ranganayukala mandapam.

 

It is said that the first phase of ten days prior to Vaikunta Ekadasi is called Pagal Pattu and the second phase of chanting is done at nights and called Rapathu. On 22nd Day Kanninun Siruttambu, on 23rd day Ramanuja Nutrandadi, on 24th day Sri Varaha Swamy Sattumora will be observed. Adhyayanotsavams will conclude with the Tiruppalandu Todakkam ritual.

 

As mentioned in the rock inscriptions of 1253 and 1360, 1446 the Adhyayanotsavams was initiated at Tirumala by Tirumangai Alwars, Nathamuni and Bhagavad Ramanujacharya,

 

The unique ritual has a special place in the Agama traditions practised by the Sri Vaikhanasa sect of Sri Vaishnavite temples.

 

The senior and junior Pontiffs of Tirumala, Addition EO Sri AV Dharma Reddy, DyEO Sri Ramesh Babu and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2022 జనవరి 02: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు.

ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌‌స్వామి, టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.