KOIL ALWAR TIRUMANJANAM PERFORMED _ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 14 Jul. 20: In view of auspicious Anivara Asthanam at Tirumala on Thursday, the temple cleansing fete, Koil Alwar Tirumanjanam has been performed with religious fervour in Tirumala on Tuesday.

The entire temple premises were cleansed with “Parimalam”, an aromatic mixture which is a composition of Kicchiligadda (a root vegetable), turmeric, vermilion and sandal. This thick paste is applied all over the roofs, walls, ceiling etc. While the entire process was underway, the presiding deity icon was closed with a veil. After the fete, the veil was removed and special pujas were performed to Sri Venkateswara Swamy followed by Neivedyam and Harati. Later devotees were allowed for darshan.

TTD EO Sri Anil Kumar Singhal, speaking to media persons outside the temple said, the Koil Alwar Tirumanjanam takes place four times a year before Ugadi, Anivarastanam, annual brahmotsavams and Vaikuntha Ekadasi. “The temple cleansing fete was observed from Ananda Nilayam to Bangaru Vakili. In view of COVID 19 restrictions, only a few temple staff participated in the cleansing fete”, EO added. 

Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Harindranath and others participated.

Later TTD EO, Additional EO, TTD Board special invitee Sri Govindahari took part in Sundarakanda Pathanam held at Nada Neerajana Mandapam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 14 జూలై 2020: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16న ఆణివార ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈఓ శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ సాధార‌ణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఇందులో భాగంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రం చేశార‌ని చెప్పారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన లేపనాన్ని ఆలయగోడలకు పూసిన‌ట్టు చెప్పారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌రిమిత సంఖ్య‌లో సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ట్టు వివ‌రించారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉద‌యం 9 గంట‌ల నుండి భక్తులను దర్శనానికి అనుమతించిన‌ట్టు తెలిపారు. అనంత‌రం సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో ఈవో, అద‌న‌పు ఈవో, బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ గోవింద‌హ‌రి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఆరోగ్య శాఖాధికారి డా. ఆర్‌.ఆర్‌.రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.