TIRUMALA CHIEF PRIEST DENIES THE FALSE PUBLICITY OVER CLOSURE OF DARSHAN IN HILL SHRINE FOR SIX MONTHS _ శ్రీవారి ఆలయంలో మార్చి నుండి 6 నెలలపాటు స్వామివారి దర్శనం నిలుపుదల ప్రచారం అవాస్తవం

TIRUMALA, 30 DECEMBER 2022: One of the Chief Priests of Tirumala temple Sri Venugopal Dikshitulu denied the rumours over the closure of the Hill Shrine for six months as propagated in a few media platforms and affirmed that the Darshan of Mula Virat remains as usual in view of Gold plating works of Anandanilaya Gopuram.

Explaining the factual position on the issue Sri Venugopal Dikshitulu cleared that TTD board had decided to take up gold plating works of Ananda Nilaya Gopuram from March 1 in 2023 and will be completed within six months.

He said a week ahead of the commencement of the works certain Agama practices like(Balalayam) will be taken up by setting up a temporary (Daru) idol.

During the six months period the devotees could continue to have Srivari Dharshan of Mula murti. However all the arjita sevas would be performed in Ekantham only from morning Suprabatam to Ekantha Seva in the night as per Agama traditions. 

The arjita sevas like kalyanotsvam arjita Brahmotsavam etc. will be performed for the utsava idols of Sri Malayappa Swami and his consorts Sridevi and Sri Bhudevi.

As per records of such gold plating works in 1957-58 and during Balalaya fete in 2018, Srivari Mula murti Darshan and arjita sevas for utsava idols were performed without any break.

In this background of such perusal of Agama practices by the temple  administration, TTD appealed to devotees not to believe and trust in such false publicity over closure of Srivari Darshan for six months.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో మార్చి నుండి 6 నెలలపాటు స్వామివారి దర్శనం నిలుపుదల ప్రచారం అవాస్తవం

– భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి

– యధావిధిగా మూలమూర్తి దర్శనం : శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు

తిరుమల, 30 డిసెంబరు 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనందనిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదు.

ఈ అంశానికి సంబంధించిన వాస్తవ వివరాలను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1న తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారు. ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యధావిధిగా దర్శించుకోవచ్చు. బాలాలయంలోని దారు విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. గర్భాలయంలో మూలమూర్తికి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తికి, బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యధావిధిగా జరుగుతాయి.

1957-58వ సంవత్సరంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం జరిగిన సందర్భంలో, 2018వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో బాలాలయం నిర్వహించిన సందర్భంలో ఉన్న రికార్డుల ప్రకారం భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించడం జరిగింది.

వాస్తవం ఇలా ఉండగా, కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో 6 నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

టిటిడి  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.