YOGA DARSHANAM TO CONCLUDE ON DECEMBER 31 _ డిసెంబర్ 31న ముగియనున్న యోగ దర్శనం 

TIRUMALA, 30 DECEMBER 2022: The famous Yoga Darshanam programme is all set to conclude at Nada Neerajanam in Tirumala on December 31.

Among the various spiritual programmes commenced by TTD in the last two years, seeking divine intervention from the Covid pandemic for the sake of global devotees, Patanjali Yoga Darsanam is one such programme that won accolades across the world.

Commenced on April 10 at Nadaneerajanam Mandapam, the programme lasted for over eight months. While renowned Sanskrit scholar and Professor of National Sanskrit University Sri Kuppa Vishwanatha Sharma explained the Patanjali Yoga Darshana Sutras while Dharmagiri Veda Vignana Peetham Acharya Sri PVNN Maruti recited the Shlokas in this leading programme which received overwhelming response from the pilgrims all over. 

After casting its magical devotional spell for 265 days, the programme is all set to conclude on the last day of the year 2022 on December 31. This programme will be telecasted live by SVBC between 6pm and 7pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబర్ 31న ముగియనున్న యోగ దర్శనం 

తిరుమల, 30 డిసెంబరు 2022: తిరుమలలోని నాదనీరాజన వేదికపై జరుగుతున్న యోగ దర్శనం కార్యక్రమం డిసెంబర్ 31న ముగియనుంది.

కోవిడ్ మహమ్మారి నుండి ప్రపంచ మానవాళిని రక్షించాలని కోరుతూ టిటిడి గత రెండేళ్లలో ప్రారంభించిన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పతంజలి యోగ దర్శనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రారంభమైన ఈ కార్యక్రమం 8 నెలలకు పైగా కొనసాగింది.

ప్రఖ్యాత సంస్కృత పండితుడు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ పతంజలి యోగ దర్శన సూత్రాలను వివరించగా, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ మారుతి శ్లోకాలను పఠించారు. 265 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం డిసెంబర్ 31న ముగియనుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.