GRAND POURNAMI GARUDA SEVA HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 19 Dec. 21: TTD organised a grand monthly Pounamu Garuda Sava on Sunday evening wherein bejewelled Sri Malayappa Swamy rode on colourful vahana on Mada streets and blessed devotees.

 

Garuda, the favourite charioteer of Sri Venkateswara is symbolically heralded in all 108 Vaishnava countries. He is also hailed as an icon of wisdom and bracing and Srivari Darshan on his vehicle brought boons and averted all sins.

      

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, Srivari temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 19: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజిఓ శ్రీ బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.