FOLLOW THE DIVINE PATH SHOWN BY THE SAINTLY PERSONS- PONTIFF OF UDIPI _ మ‌హ‌ర్షుల అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి: శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

Tirupati, 10 Jan. 20: Calling upon the members of Dasa Sahitya Bhajan troupes, the Pontiff of Puttige mutt of Udipi Sri Sugunendratheertha Swamy said, the Dasaparas should follow the divine path laid by the saintly persons in the propagation of Sanatana Dharma.

He was Participating in the Traimasika Metlotsavam organised under the aegis of Dasa Sahitya Project of TTD during the wee hours of Friday at Padala mandapam in Alipiri.

He said devout saint poets like Sri Purandara Dasa, Sri Vysarayathirtha, Sri Annamacharya and also emperor like Sri Krishnadevaraya had walked up Tirumala hills on foot and spread the glory and significance of Sri Venkateswara Swamy to the entire world.

The pontiff said the Metlotsavam was a divine festival organised by TTD to commemorate the holy acts of great devotees.

Dasa Sahitya Project Special Officer Dr. PR Anandathirthacharyulu said a large number of devotees from south India and Maharashtra gathered to sing bhajans and climb Tirumala.

Earlier the TTD organised special programmes like religious discourses, bhajans, Haridasa keertans and FAQs of Sanatana Hindu dharma propagation at third Chowltry in Tirupati.

Over 3000 bhajan Mandal members took part in this celestial fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

మ‌హ‌ర్షుల అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి : శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు మ‌హ‌ర్షులు సూచించిన మార్గంలో న‌డిచి శ్రీ‌వారి వైభ‌వాన్ని, ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని ఉడిపికి చెందిన పుత్తిగె మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర‌తీర్థ‌స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్ర‌వారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర‌తీర్థ‌స్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర‌తీర్థ‌స్వామీజీ మాట్లాడుతూ బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ  వివిధ  ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
           
 అంతకుముందు భజనమండళ్ల స‌భ్యులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3,000 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.