ASHTOTHARA SHATA KALASABHISHEKAM IN SRI KRT _ శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati, 10 Jan. 20: The  holy ritual of Astottara Shara  Kalashabisekam was conducted for utsava idols Swami and Ammavaru at the Sri Kodandaramaswami temple on Friday morning at mandapam with 108 kalasas.

As a part of event there was a colorful procession of utsava idols of Sri Sita Laksmana Sameta Sri Kodandarama Swami on the mada streets and later to Sri Ramachandra Pushkarani for Asthanam and later harati is rendered.

Temple DyEO Smt VR Shanti, devotees participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

 

శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుప‌తి, 10 జ‌న‌వ‌రి 2020: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో ఉదయం 9 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి విఆర్‌.శాంతి, ఏఈవో శ్రీ ఎస్‌.తిరుమ‌ల‌య్య‌, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.