DEVOTEES WERE THRILLED TO SEE THE NETRA DARSHAN AND TIRUPPAVADA SEVA OF SRIVARU _ శ్రీవారి ‘నేత్రదర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన హైదరాబాద్ వాసులు

GOA GUV OFFERS PRAYERS

HYDERABAD, 13 OCTOBER 2022: As a part of the ongoing Sri Venkateswara Vaibhavotsavams in Hyderbad, the Governor of Goa, Sri PS Sridharan Pillai took part in the event on the third day on Thursday. The denizens of Hyderabad had a delightful Netra Darshanam of Sri Venkateswara Swamy on Thursday.

After the morning Sevas, the Mula Virat was divested of all ornaments, flowers etc. The deity was draped only in Dhoti and Uttareeyam. The Thirunaman Kaappu and Kasturi on the forehead of the main deity were also reduced in size resulting in the uniquer Netra Darshan (where the divine eyes of the Lord can be seen) of the main deity which happens only on Thursdays. 

On Thursdays, Thiruppavada Seva was performed as an Arjitha Seva in Tirumala temple in front of the Bangaru Vakili and Annakoototsavam (where heaps of tamarind rice is poured) is performed. The same fete was replicated in the spacious NTR Stadium at Hyderabad on Thursday between 8.30am and 10.30am which immersed the denizens in devotional waves.

SIGNIFICANCE: A large rectangular tub-like vessel was placed in front of the main deity and a huge quantity of “Pulihora”-tamarind rice, deposited thereon with coconuts, flowers, sandal paste, kumkum, deepam and was placed in that trapezoid receptacle to be offered as Naivedya to the Lord. It is believed that the Lord’s first gaze after “opening” His Eyes during Netra Darshanam should not fall on mortals, because it has huge power that could not be withstand by humans. Instead, it is made to fall on the mound of “Pulihora” directly placed in front of Him, thereby sanctifying it and reducing the intensity of His Gaze. The “Pulihora” therefore acts like a Veil (“Paavada” in Telugu/Tamil) protecting devotees from His Powerful Gaze. And hence the name,-Tiruppavada Seva.

DEVOTIONAL TREAT: The performance by the artists of Annamacharya Project allured the devotees. Sri Saraswathi Prasad and his team rendered Vinnapalu Vinavale, Vinaro Bhagyam Vishnukatha, Govinda Govinda Yani Koluvare, Kodalalo Nelakonna, Brahmamokkate, Vedukondama, Jagadapu and many more noteworthy songs penned by the Saint Poet Sri Tallapaka Annamacharya on the occasion. 

One of the Chief Priests of Tirumala Temple Sri Venugopala Deekshitulu, Agama Advisor Sri Mohana Rangacharyulu, Rajyasabha MP Sri Vemireddi Prabhakar Reddy, New Delhi LAC Chief Smt Prasanthi Reddy, donors Sri Harshavardhan, Sri SS Reddy, Sri Venkateswar Reddy, Sri Subba Reddy, Deputy EO of Tirumala temple Sri Ramesh Babu, All Dharmic Projects of TTD Programme Officer Smt Vijayalakshmi, Annamacharya Project Director Dr Vibhishana Sharma, AEOs Sri Jaganmohanachary, Sri Parthasaradhi, Sri Sriramulu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ‘నేత్రదర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన హైదరాబాద్ వాసులు
 
– స్వామివారిని దర్శించుకున్న గోవా గవర్నర్ శ్రీ పిఎస్.శ్రీధరన్ పిళ్లై
 
హైదరాబాద్, 2022 అక్టోబరు 13: హైదరాబాద్‌లో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు. గోవా గవర్నర్ శ్రీ పిఎస్.శ్రీధరన్ పిళ్లై స్వామివారిని దర్శించుకున్నారు.
 
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సేవగా తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు.
 
నేత్రదర్శనం  విశిష్టత :  
 
ప్రతి గురువారం ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, మొదటి సహస్రనామార్చన, నైవేద్యం తరువాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు, నగలను అర్చకులు తొలగిస్తారు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గించడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయి. అందువల్లే దీనిని నేత్ర దర్శనం అంటారు.
 
తిరుప్పావడ సేవ  – ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు :
 
ప్రతి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అర్చనానంతరం జరిగే నివేదననే తిరుప్పావడసేవ అని, అన్నకూటోత్సవమని అంటారు. ఈ ఘట్టాన్ని హైదరాబాద్‌లోని శ్రీవారి నమూనా ఆలయంలో అర్చకులు భక్తుల ఎదుట ఆవిష్కరించారు.
 
శ్రీస్వామివారికి ఎదురుగా పెద్దపీఠంపై పులిహోర రాశిని ఏర్పాటుచేశారు. పులిహోరతోపాటు టెంకాయ, ఇతర పూజాసామగ్రితో అలంకరించారు. వీటిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. ఆ తరువాత భక్తుల చేత సంకల్పం చెప్పించారు. వేదపండితులు వేద పారాయణంతోపాటు శ్రీనివాస గద్యాన్ని పఠించారు.
 
అంతకుముందు శ్రీవారి మూలవిరాట్‌ నొసటన వెడల్పుగా గల నామాన్ని తగ్గించి సన్నగా చేశారు. ఈ మొత్తం కైంకర్యమంతా తెరల వెనకనే చేస్తారు. ”శ్రీవారు నేత్రాలు తెరిచిన తర్వాత తొలి చూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయి. వీటిని మానవమాత్రులు ఏమాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగానే స్వామివారి తీక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చూస్తారు. దీనివల్ల ఆ ఆహారపదార్థాలు పవిత్రత పొందుతాయి. 
 
దేశ ప్రజలందరూ పాడిపంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బందీ రాకూడదని, సర్వసౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు అభివృద్ధి పొందాలని, ఎటువంటి ఈతి బాధలు కలుగకూడదని సంకల్పాన్ని చెప్పి తిరుప్పావడ సేవను ఆచరిస్తారు.
 
అనంతరం ఉదయం 10.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
 
భక్తిభావాన్ని పంచిన శ్రీ సరస్వతి ప్రసాద్ గాత్ర సంగీతం
 
ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ సరస్వతి ప్రసాద్ ఆలపించిన పలు  అన్నమయ్య సంకీర్తనలు భక్తిభావాన్ని పంచాయి. వీటిలో “విన్నపాలు వినవలె వింత వింతలు…., వినరో భాగ్యము విష్ణుకథ…., గోవింద గోవిందయని కొలువరే…., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే…., వేడుకొందామా…, జగడపు చనవుల జాజర… ” తదితర కీర్తనలు ఉన్నాయి. గాయకుడితో పాటు భక్తులు గొంతు కలిపి ఈ కీర్తనలు ఆలపించారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. 
 
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దాతలు శ్రీ హర్షవర్ధన్‌, శ్రీ ఎస్‌ఎస్‌.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీమతి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఏఇఓలు శ్రీ జగన్మోహనాచార్యులు, శ్రీ పార్థసారథి, శ్రీ శ్రీరాములు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.