LAKSHA KUMKUMARCHANA IN SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

Tirupati, 14 Aug. 20: Following last Sravana Friday, Laksha Kumkumarchana fete was observed in Sri Kapileswara Swamy temple at Tirupati.

The Kamakshi Ammavaru was decked beautifully and the Archana with vermilion was performed by the priests following COVID guidelines.

Deputy EO Sri Subramanyam, Superintendent Sri Bhupati were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి, 2020 ఆగస్టు 14: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేప‌ట్టారు. ముందుగా క‌ల‌శ‌స్థాప‌న‌, గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చనం, క‌ల‌శారాధ‌న చేశారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూపతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.