SRIVARI DARSHAN TO CHALLENGED AND ORPHANS IS MADHAVA SEVA SAYS TTD CHAIRMAN YVSR _ దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం పుణ్య‌కార్యం : టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirupati, 23 Feb. 20: TTD chairman Sri YV Subba Reddy today said that it was a holy opportunity for him to organise Srivari Darshan and also visit to other pilgrim centres to challenged and orphans of a destitute home in Srikakulam.

Addressing reporters at Sri Padmavathi Rest house the Chairman said during his recent visit to Simhachalam near Visakhapatnam, he was requested by a social worker Siddharth about desire of the 17 orphans including challenged persons for Srivari darshan.

Considering service to poor and challenged persons as a Madhava seva the Chairman Said he has organised their visit at his personal expense not only for Tirumala Srivari darshan but also visit to Kanipakam and Golden temple of vellore.

He said it was a great satisfaction to see the bright and happy faces of orphans after Srivari darshan.

TTD CHAIRMAN CONDEMNS BASELESS REPORT IN SOCIAL MEDIA

The Chairman Sri Reddy also, condemned a baseless and fake report in Social media, which was being investigated by TTD vigilance officials.

He said TTD had decided to take stringent actions against persons involved in publishing such falsehood and baseless reports in social media in Future.

CASE REGISTERED IN TIRUPATI EAST POLIC STATION ON BASELESS REPORT

A case has been registered on a social media publication for its baseless report that TTD funds have been transferred to State government account. Following a complaint by TTD officials the police are investigating the complaint.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం పుణ్య‌కార్యం : టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

 ఫిబ్రవరి 23, తిరుప‌తి 2020: శ్రీ‌కాకుళం జిల్లాలోని ఓ అనాథాశ్ర‌మానికి చెందిన 17 మంది దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు సొంత ఖ‌ర్చుల‌తో తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నంతోపాటు మ‌రికొన్ని ఆల‌యాలను సంద‌ర్శించేలా ఏర్పాట్లు చేశాన‌ని, దీన్ని పుణ్య‌కార్యంగా భావిస్తున్నాన‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఆదివారం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు.

తాను సింహాచ‌లం దేవ‌స్థానికి ద‌ర్శ‌నానికి వెళ్లిన‌పుడు అనాథాశ్ర‌మం నిర్వాహ‌కుడైన శ్రీ సిద్ధార్థ క‌లిశార‌ని, స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని దివ్యాంగులు, అనాథ భ‌క్తులు ఎదురుచూస్తున్నార‌ని తెలిపార‌ని ఛైర్మ‌న్ వివ‌రించారు. ఆ మేర‌కు శ్రీ‌కాకుళం నుండి రైలు ప్ర‌యాణ ఖ‌ర్చులు భ‌రించి తిరుమ‌ల‌కు ర‌ప్పించి స్వామివారి ద‌ర్శ‌నం చేయించామ‌ని తెలిపారు. అదేవిధంగా, కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ ఆల‌యాల‌ను కూడా సంద‌ర్శించేందుకు ఏర్పాట్లు చేశామ‌ని వివ‌రించారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం దివ్యాంగులు, అనాథ‌లు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశార‌ని, దీన్ని భ‌గ‌వంతుని సేవ‌గా భావిస్తున్నాన‌ని తెలిపారు.

టిటిడిపై సామాజిక మాధ్య‌మాలలో అవాస్త‌వ క‌థ‌నాన్ని ఖండించిన ఛైర్మ‌న్‌

టిటిడికి సంబంధించి సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చార‌మ‌వుతున్న అవాస్త‌వ‌ క‌థ‌నాన్ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఖండించారు. ఈ అంశంపై టిటిడి అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నార‌ని తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టిన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఈస్ట్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు

టిటిడి నిధులు రాష్ట్ర ప్ర‌భుత్వ ఖాతాలోకి జ‌మ అయ్యాయంటూ అవాస్త‌వాల‌ను సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం చేస్తున్న వారిపై ఆదివారం తిరుప‌తిలోని ఈస్ట్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. టిటిడి అధికారుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.