MAJESTIC TRISHULA SNANAM AT SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

Tirupati, 23 Feb. 20: Heralding the grand finale of the annual Brahmotsavams of TTD local temple of Sri Kapileswara Swamy Temple an majestic Trishula snanam was performed on Sunday morning after the Surya Prabha vahanam with participation of TTD JEO Sri P Basant Kumar along with countless devotees.

Earlier a traditional snapana thirumanjanam was performed to Trishula the weapon of Sri Skandamurthy.

Speaking after the Agama ritual heralding, the fav end of the annual Brahmotsavams, the JEO Sri Basant Kumar said devotees were happy about arrangements made by TTD and had participated u. Large number and befit lords blessings.

The Brahmotsavams final event of Dwaja Avarohanam was held on Sunday evening followed by the Ravanasura vahanam at night.

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi Raju, Temple inspectors Sri Reddy Sekhar and Sri Srinivas Naik and others participated.

HIGHLIGHTS OF BRAHMOTSAVAMS

  • TTD spent ₹5 lakhs for civil engineering works and ₹6 lakhs for electrical decorations.
  • TTD served Anna Prasadam to 500 devotees daily during Brahmotsavams and for thousands on the vahanam day besides drinking water, milk, buttermilk etc. daily.
  • In all four tons of flower Meereen used for Vahanam and temple decorations.
  • Security was provided with 100 TTD vigilance, 350 Srivari Sevakulu, and 100 scouts and guides.
  • Adequate parking and traffic management was also organised.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 23: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ దంప‌తులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు  శ్రీనటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ అన్నారావు సర్కిల్‌ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.

అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షి స‌మేత శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారికి, స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. ఇందులో భాగంగా పంచామృతాలు, సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ మాట్లాడుతూ ప‌విత్ర‌మైన త్రిశూల‌స్నానంలో పాల్గొన‌డం పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై భ‌క్తులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలిపారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.

హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరదారాపహరణమనే దుర్మార్గాన్ని చేయడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీకపిలేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ మ‌ణిస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర‌రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల విశేషాలు :

ఈ బ్ర‌హ్మోత్స‌వాల కోసం రూ.20.50 ల‌క్ష‌ల‌తో ఆల‌యంలో చ‌లువ‌పందిళ్లు త‌దిత‌ర సివిల్ ఇంజినీరింగ్ ప‌నులు, రూ.6 ల‌క్ష‌ల‌తో  విద్యుత్ అలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. రోజుకు 500 మంది భ‌క్తుల‌కు మ‌ధ్యాహ్నం 12.30 నుండి 3 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 6.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేరు. అదేవిధంగా, తాగునీరు, పాలు, మ‌జ్జిగ పంపిణీ చేశారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా నంది వాహ‌నం రోజున వేలాది మంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందించారు. 100 మంది టిటిడి భ‌ద్రతా సిబ్బంది, 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 100 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్‌ భ‌క్తుల‌కు సేవ‌లందించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహ‌నాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 4 ట‌న్నుల పుష్పాలతో ఆక‌ట్టుకునేలా ప్ర‌త్యేక పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.