KOIL ALWAR TIRUMANAJANAM PERFORMED AT SRI KRT _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఆల‌య ప్రాంగ‌ణంలోనే బ్రహ్మోత్సవ‌ వాహ‌న‌సేవ‌లు

శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాలు, తెప్పోత్స‌వాలు ర‌ద్దు

తిరుప‌తి, 20 మార్చి 2020: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలో మార్చి 23 నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. మార్చి 22న అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

 ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌ పాల్గొన్నారు.

ఆల‌య ప్రాంగ‌ణంలోనే బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు

ఆలయంలో మార్చి 23 నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆల‌యంలో వారం రోజుల పాటు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాల‌ను నిలుపుద‌ల చేశారు. అదేవిధంగా, బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం, రాత్రి వాహ‌న‌సేవ‌ల‌ను మాడ వీధుల్లో ఊరేగింపును ర‌ద్దు చేశారు. ఈ వాహ‌న‌సేవ‌ల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే నిర్వ‌హిస్తారు. మార్చి 30న ర‌థోత్స‌వాన్ని, మార్చి 31న క‌పిల‌తీర్థంలో చ‌క్ర‌స్నానాన్ని ర‌ద్దు చేశారు.  

శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాలు, తెప్పోత్స‌వాలు ర‌ద్దు

ఆల‌యంలో ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాల‌ను, ఏప్రిల్ 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న తెప్పోత్స‌వాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఏప్రిల్ 3న శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

Tirupati, 20 Mar. 20: The traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam was performed in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Friday in view of annual Brahmotsavams in the temple which commences from March 23.

As a part of the religious event, the entire temple premises is cleaned with an aromatic mixture consisting of Kicchili Gadda(a root vegetable), Turmeric, Vermilion, Sandal Paste which was applied to the roofs, walls, pillars of the temple, which acts as a traditional disinfectant apart from being a cleanser.

This celestial event was carried out in the temple from 6am to 9am on Friday and the religious staff and office staff of the temple participated in the cleansing activity.

Temple DyEO Smt Shanti, AEO Sri Durgaraju, Superintendent Sri Ramesh and other staff members were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI