IInd day of PAVITHROTSAVAM in Sri Kodanda Rama Swamy Temple _ శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ

Tirupati, 17  July 2012: On the Second day of the Ongoing Three day Annual Pavithrotsavam, Pavithras, the garlands made from special thread are taken in a procession and used to decorate Lord Kodanda Rama Swamy and his consorts in Temple, on Sunday morning.
 
Earlier the Temple Priests performed Snapana Tirumanajanam (Celestial Bath) to the processional deities inside  Temple Premises.
 
Sri L.V.Subramanyam, Executive Officer, Sri Chinnaswamy, DyEO(Local Temples), Sri Chandrasekhar Pillai, AEO, Sri Munisuresh Reddy, Supdt, Sri Anjaneyulu, Temple Inspector and a large number of Devotees took part.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2012 జూలై 15: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి  శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సతీసమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో ఆలయంలో ఏవైనా పొరబాట్లు, దోషాలు జరిగి ఉంటే, వాటి నివారణకు వైఖానస ఆగమబద్ధంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు ధన్యులని, వారికి సుఖసంతోషాలు సిద్ధిస్తాయని అన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.

కాగా ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేరాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. ఉదయం 11.00 గంటలకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.

అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు. రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నస్వామి, విజిఓ శ్రీ ఎం.ఎల్‌.మనోహర్‌,  సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర్‌ పిళ్లై, సూపరింటెండెంట్‌ శ్రీ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ సుందరం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.