ANKURARPANAM HELD _ శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 15 MAY 2022: Ankurarpana for the annual Pushpayagam was held at Sri Kapileswara Swamy temple on Sunday evening.

 

The floral ritual will be observed between 10am and 12noon on Monday in the temple. Gruhastas shall take part on payment of Rs. 200 per ticket for which two persons will be allowed.

 

Deputy EO Sri Devendrababu, AEO Sri Srinivasulu, Superintendent Sri Bhupati, temple inspector Sri Reddy Sekhar were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2022 మే 15: తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో సోమ‌వారం జరుగనున్న ప‌త్ర‌పుష్పయాగానికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

మే 16న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు సోమ‌స్కంద‌మూర్తికి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యాగ మ‌హోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలు, ప‌త్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది. గృహ‌స్తులు(ఇద్ద‌రు) రూ.200/- చెల్లించి ప‌త్రపుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.

ఈ  ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులు, భ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.