VENGAMAMBA JAYANTHI OBSERVED _ వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం : శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి స్వామీజీ
TIRUMALA, 15 MAY 2022: In connection with the 292nd Jayanthi of Matrusri Tarigonda Vengamamba, Unjal Seva of Sri Malayappa Swamy and His Consorts took place in Narayanagiri Gardens on Sunday evening.
In his Anugraha Bhashanam, the Visakha Sarada Peetham Seer Sri Swarupannda Maha Saraswati Swamy said following the impeccable literary contributions made by Vengamamba, he adviced TTD to set up an exclusive Project on her dedication which today grew into many folds
He said, Vengamamba was a blessed soul. Even after her demise, she settled in the sacred abode as her Brindavanam was in Tirumala.
The Pontiff complimented TTD officials for observing the fete with celestial grandeur every year.
Earlier the Annamacharya Project artists and SV College of Music and Dance artists presented the Sankeertans penned by Vengamamba in Yakshagana Style including Gana Nayaka Saranu…
Balagopalam Bhaje He Manasa…
Vacchenu Krishnudu Vagameeraga…
Sri Madana Gopala Shringa Rarasaleela..
Nanda Nandanate Namo Namo…
Nirupama Brahmakala…
Sri Pannagadrivara Sikharagravasunaku… in a melodious manner.
Later the Seer released the Third Volume of Vengamamba book penned by Dr KJ Krishna Murty.
The Swamiji was presented with Vastram later felicitated TTD EO Sri AV Dharma Reddy on the occasion
Uttaradhikari Sri Swatmanada Saraswati, Annamacharya Project Director Dr Vibhishana Sharma, All Projects Program Officer Sri Vijayasaradhi and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం : శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి స్వామీజీ
ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి
తిరుమల, 2022 మే 15: శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామిస్వామీజీ పేర్కొన్నారు. మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు ఆదివారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ వెంగమాంబ తన సాహిత్యం, సంకీర్తనల ద్వారా అప్పట్లో సమాజంలో ఉన్న సమస్యలకు వ్యతిరేకంగా పోరాడి సంస్కరించారని తెలిపారు. వెంగమాంబ చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తుల్లోని అంశాలను తెలుసుకోవచ్చన్నారు. టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు స్థాపనలో విశాఖ శారద పీఠం విశేష కృషి చేసిందన్నారు. తాళ్ళపాక అన్నమాచార్యులవారు తన సంకీర్తనలతో శ్రీవారిని దర్శించారని, వెంగమాంబ సజీవ సమాధి తరువాత కూడా స్వామి ఆలయానికి దగ్గరగా ఉండి సేవిస్తున్నారన్నారు. టీటీడీ వెంగమాంబ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు స్వామిజీ అభినందించారు.
అనంతరం టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి స్వామీజీని, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీని శ్రీవారి ప్రసాదంతో సత్కరించారు. అనంతరం స్వామిజీ ఈవోని శాలువాతో సత్కరించారు.
ముందుగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. సాయంత్రం 6.00 గంటలకు ఊంజల్‌సేవ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ యక్షగానం సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. ఇందులో ” గణనాయక శరణు…., బాలగోపాలం భజే హే మనసా…., వచ్చెను కృష్ణడు వగమీరగ…., శ్రీ మదన గోపాల శృంగరారసలీల……..నంద నందతే నమో నమో…….., జయమంగళం నిత్య శుభ మంగళం….” తదితర సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తర్వాత డాక్టర్ కెజె.కృష్ణ మూర్తి రచించిన వెంగమాంబ పుస్తకం మూడవ సంపుటాన్ని స్వామిజీ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఇ – 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, హిందూ ధార్మక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ విజయసారథి, అన్నమాచార్య ప్రాజెక్టుల సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.