JEO RELEASED WALL POSTERS OF SRI KAPILESWARA SWAMY TEMPLE BTU _ శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 28 Jan. 20: The JEO Sri P Basant Kumar also unveiled the wall posters of the annual Brahmotsavams of Sri Kapileswara swamy temple commencing from February 14-23 at his chambers in the administrative building on Tuesday morning.

He said the koil Alwar Thirumanjanam will be held on February 12 and Ankurarpanam on February on 13tl and Dwajarohanam on February 14 at 08.04 am in kumbha lagnam.

Temple DyEO Sri Subramanyam, Temple Supdt Sri Bhupathi, Temple Inspector Sri Reddy Sekhar were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

 

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 28: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయంలో ఫిబ్రవరి 12వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, ఫిబ్రవరి 13న అంకురార్పణ జ‌రుగ‌నున్నాయ‌ని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 14న ఉద‌యం 8.04 గంట‌ల‌కు కుంభ ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామ‌ని తెలిపారు. తిరుప‌తి, ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                   ఉదయం             సాయంత్రం

14-02-2020(శుక్ర‌వారం) ధ్వజారోహణం(కుంభలగ్నం)       హంస వాహనం

15-02-2020(శ‌నివారం)         సూర్యప్రభ వాహనం      చంద్రప్రభ వాహనం

16-02-2020(ఆదివారం)      భూత వాహనం           సింహ వాహనం

17-02-2020(సోమ‌వారం)        మకర వాహనం         శేష వాహనం

18-02-2020(మంగ‌ళ‌వారం)       తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం

19-02-2020(బుధ‌వారం)         వ్యాఘ్ర వాహనం         గజ వాహనం

20-02-2020(గురువారం)         కల్పవృక్ష వాహనం అశ్వవాహనం

21-02-2020(శుక్ర‌వారం)          రథోత్సవం(భోగితేరు)           నందివాహనం

22-02-2020(శ‌నివారం)       పురుషామృగవాహనం                     కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం  

23-02-2020(ఆదివారం)       శ్రీనటరాజస్వామివారి సూర్యప్రభ వాహనం         త్రిశుల స్నానం          రావణాసురవాహనం ధ్వజావరోహణం.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూప‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.