JEO RELEASED WALL POSTER OF SRI GRT TEPPOTSAVAM _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి తెప్పోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 28 Jan. 20: TTD Joint Executive Officer, Sri P Basant Kumar unveiled the wall posters of Teppotsavams of Sri Govindaraja Swamy Temple and Annual Brahmotsavams of Sri Kapileswara swamy temple at his chambers in the administrative building on Tuesday morning.

He said the float festival would commence on February 2 till February 8 for which a colourful float is being decked up with flower and electrical decorations.

Special grade DyEO Smt Varalakshmi, Estate Officer Sri Devender Reddy and others temple officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి తెప్పోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 28: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ  వరకు ఏడు రోజుల పాటు జ‌రుగ‌నున్న తెప్పోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ తెప్పోత్స‌వాల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిస్తార‌ని తెలిపారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తార‌ని తెలియ‌జేశారు. ఫిబ్రవరి 2న శ్రీ కోదండరామస్వామివారు 5 చుట్లు, ఫిబ్రవరి 3న శ్రీ పార్థసారథిస్వామివారు 5 చుట్లు, ఫిబ్రవరి 4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు 5 చుట్లు, ఫిబ్రవరి 5న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు 5 చుట్లు, ఫిబ్రవరి 6, 7, 8వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు 7 చుట్లు తిరిగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తార‌ని వివ‌రించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తార‌ని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.