PAVITROTSAVAMS IN TTD TEMPLES _ శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 16 SEPTEMBER 2021:  Pavitrotsavams commenced on a grand religious note in Sri Govindaraja Swamy temple on Thursday in Ekantam.

 

As part of it, Snapana Tirumanjanam to deities were performed. Evening Pavitra Pratista will be performed on the first day of Pavitrotsavams.

 

Both the Senior and Junior Pontiffs of Tirumala, Spl.Gr.DyEO Sri Rajendrudu and others were present.

 

At Narapura Venkateswara Swamy temple in Jammalamadugu of YSR Kadapa District, Pavitrotsavams commenced. Chatusthanarchana, Agnipratista and Pavitra Pratista are performed followed by Vaidika programmes in the evening in Yagashala in Ekantam.

 

AEO Sri Muralidhar, Temple Inspector Sri Munikumar were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 16: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద‌యం 10.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం జరిగింది. స్వామి, అమ్మ‌వార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.

యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌ స్వామి, ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.