EX-OFFICIO AND SPECIAL INVITEE TAKE OATH _ టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యునిగా డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
SECOND TIME OPPORTUNITY WITH THE BLESSINGS OF SRIVARU-SPECIAL INVITEE
TIRUMALA, 16 SEPTEMBER 2021: With the benign blessings of Sri Venkateswara Swamy, I have got a second-time opportunity to serve as Special Invitee of TTD Trust Board, said Tirupati MLA Sri B Karunakar Reddy.
Sri Reddy was administered oath as Special Invitee of TTD Board on Thursday in Srivari temple at 11:30am by TTD Additional EO Sri AV Dharma Reddy. After darshan of Sri Venkateswara Swamy he was given Vedasirvachanam and presented with Theertha Prasadams.
Later speaking to media persons outside Tirumala temple, Sri Reddy said earlier also, the TTD Board under the Chairmanship of Sri YV Subba Reddy did execute lot of spiritual, devotional and pilgrim welfare activities. “We will continue our efforts to serve the pilgrims with more enthusiasm. I whole-heartedly thank our beloved Chief Minister Sri YS Jaganmohan Reddy for giving me yet another opportunity to serve the devotees to my best possible abilities”, he added.
Earlier, the Chairman of Tirupati Urban Development Authority (TUDA) and Chandragiri Legislator Dr C Bhaskar Reddy took oath as Ex-officio member of TTD Trust Board in Srivari temple at 10:30am. After darshan, he was rendered Vedasirvachanam and presented with Srivari Theertha Prasadams.
Temple Deputy EO Sri Ramesh Babu was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యునిగా డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
తిరుమల, 2021 సెప్టెంబరు 16: టిటిడి నూతన ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడ ఛైర్మన్ డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
అనంతరం ఆలయం వెలుపల శ్రీ కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి కృపతో రెండో సారి టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. హైందవ ధర్మ సంస్కృతిని, ఆచారాలను కాపాడడంతోపాటు టిటిడి ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ శ్రీమతి సుధారాణి, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.