BHOGI TERU PERFORMED _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా భోగితేరు

Tirupati, 14 Jan. 20: Bhogi Teru fete was observed with religious fervor in Sri Govinda Raja Swamy temple in connection with Bhogi festival on Tuesday. 

As a part of this Andal Ammavaru and Sri Krishna Swamy were taken on a celestial ride on a Teru(chariot) along mada streets. 

On Wednesday, Sankranti fete will be observed while on Thursday Goda Parinayam will be performed in a grand manner. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా భోగితేరు
 
తిరుప‌తి, 14 జ‌న‌వ‌రి 2020: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం సంక్రాంతి భోగి పండుగను ఘనంగా నిర్వహించారు.

ఇందులోభాగంగా ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభంగా ఊరేగింపు నిర్వహించారు. భ‌క్తులు క‌ర్పూర‌హార‌తులు స‌మ‌ర్పించి స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు.

జనవరి 15న మకర సంక్రాంతి

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి కావడంతో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5.30 గంటలకు సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉదయం 7 గంటలకు శ్రీ చక్రత్తాళ్వార్‌ను కపిలతీర్థం వద్దగల ఆళ్వార్‌ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి ఆస్థానం చేపడతారు.

జనవరి 16న గోదా ప‌రిణ‌యోత్స‌వం, శ్రీ కూర‌త్తాళ్వార్ శాత్తుమొర‌

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 16వ తేదీన గోదా పరిణయోత్సవం, శ్రీ కూర‌త్తాళ్వార్ శాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఉద‌యం 5 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం ఆండాళ్ అమ్మ‌వారికి శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో ఆస్థానం చేప‌డ‌తారు. అక్క‌డినుండి ఊరేగింపుగా క‌పిల‌తీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళతారు. క‌పిల‌తీర్థం నుండి పిఆర్ తోట మీదుగా తిరిగి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యానికి చేరుకుంటారు. సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు గోదా ప‌రిణ‌యోత్స‌వం నిర్వ‌హిస్తారు. శ్రీ కూర‌త్తాళ్వార్ శాత్తుమొర సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు శ్రీ కూర‌త్తాళ్వార్ స‌న్నిధికి వేంచేపు చేస్తారు. అక్క‌డ సేవాకాలం, శాత్తుమొర‌, ఆస్థానం చేప‌డ‌తారు.        

జనవరి 17న పార్వేట ఉత్సవం

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 17న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని మాడ వీధుల గుండా ఊరేగింపుగా రేణిగుంట రోడ్డులోని పార్వేట మండ‌పానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ ఆస్థానం నిర్వ‌హిస్తారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వరలక్ష్మి, ఏఇఓ శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్‌కుమార్‌, శ్రీ శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ‌ మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.