శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన అధ్యయనోత్సవాలు _ ADHYAYANOTSAVAM BEGINS AT SRI GT

Tirupati, 25 Jan. 20: Adhyayanotsavams commenced at Sri Govindaraja Swamy temple on Saturday evening.

The Divya Prabandam Parayanam is done every day in the evening in the presence of utsava idols of Sri Govindaraja Swamy and his consorts at the Kalyanam mandapam as a part of the 25 day ritual during magha masam.

As a part of the same, Chinna Sattumora is performed on February 4, pranaya kalahotsavam on February 10 and Pedda Sattumora on February 14.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన అధ్యయనోత్సవాలు

తిరుపతి, 2020 జనవరి 25: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 25వ తేదీ శ‌నివారం  అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 4న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 10న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 14న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.