PAVITRA SAMARPANA HELD AT SRI PAT _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Tiruchanoor, 1 Sep. 20: On day two of the annual ongoing Pavitrotsavam festival at the Sri Padmavati temple, Tiruchanoor, TTD EO Sri Anil Kumar Singhal participated on Tuesday in the Pavitra Samarpana event.

Earlier during the day Suprabhatham, Sahasranamarchana and Nitya Archana were performed ahead of the Pavitra samarpana.

Pavitras were offered to Mula Virat of Padmavati Ammavaru, utsava idols, sub temples, Vimana prakaram and Dhwajasthambham.

Thereafter in the evening, Vaidika programs were performed in the Yagashala of the temple.

DyEO Smt Jhansi Rani, AEO Sri Subramaniam, Kankanabhattar Sri Manikantha Swamy, Superintendent Smt Malleswari participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో  శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి 2020  సెప్టెంబర్ 01: తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
           
రెండో రోజు కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్య అర్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట వ‌ర‌కు పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో  అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.

కాగా సాయంత్ర 6.00 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్ శ్రీ మణికంఠస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి మల్లీశ్వరి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.