HIGHLIGHTS OF TTD BOARD MEETING IN TIRUMALA _ శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో రూ.53.62 కోట్లతో అభివృద్ధి పనులు- టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

TIRUMALA, 15 APRIL 2023: The TTD Trust Board Meeting was held under the Chairmanship of its Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri AV Dharma Reddy, Endowments’ Commissioner Sri Satyanarayana and other board members, LAC Chiefs at Annamaiah Bhavan in Tirumala on Saturday.

Later, the Chairman briefed media persons on some of the important resolutions. 

A committee is constituted with TTD Board members Sri Chevireddy Bhaskar Reddy, Sri Sanath Kumar and Smt Vemireddy Prashanti Reddy to deliberate with RySS and AP MARKFED  to fix rates towards purchasing 12 organic products as per TTD requirements.

Rs.53.62cr towards the construction of TB, chest and skin isolation wards and staff quarters cum hostels of Sri Padmavati women’s medical college

Sanction of ₹14 crore towards the construction of a Cold Storage and ₹18 crore for constructing a new Godown near Alipiri Marketing Godown.

₹.4.32 crore sanctioned towards the protection and raising of civet cats under a secured shelter at SV Zoological Park in Tirupati.

Granted ₹4 crore for taking up development works of Auditorium at SV College in New Delhi.

To observe annual Brahmotsavams in Sri Venkateswara temple located in New Delhi in a big way. This year the annual fete will be observed between May 3 to 13.

Nod for tenders for ₹3.12 crore towards the renovation and development works at Tataiahgunta Gangamma temple in Tirupati.  

Approval of donations of about ₹10 lakhs worth of silver Kavacha for Sri Bedi  Anjaneya by a Guntur based devotee Smt Alapati Taradevi.

Appointment of regular teaching staff in TTD general schools, Junior and Degree Colleges continuing the existing Contract Faculty. 

Srinivasa Setu works to be completed soon and bring to public utility by June 15

The annual brahmotsavams in Sri Kodanda Ramalayam at Vontimitta in YSR Kadapa district was observed with celestial grandeur and especially Sri Sita Rama Kalyanam was a huge hit as scores of devotees thronged the Kalyana Vedika to witness the mega ritual. I compliment all the TTD employees and officers who did tremendous arrangements for the big festival and also the district administration, Srivari Sevaks and everyone.

ON FRCA

The FCRA ( Foreign Contributions Regulations Act )  permissions given to TTD to receive donations from foreign and NRI devotees expired in January 2020 and TTD has already applied for its renewal.

As part of the process, the TTD had frequently clarified issues raised by the Union Home Ministry. Some objections were raised on interest accounting of such deposits by Foreign contributors due to technical issues between FCRA and State Endowments Department.

To expedite the license renewal, TTD has already remitted a fee of ₹3 crores as advised by FCRA officials.

TTD is negotiating with Union Home Ministry to waive off this amount too.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో రూ.53.62 కోట్లతో అభివృద్ధి పనులు

– టిటిడి విద్యాసంస్థల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది నియామకం

– టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, 15 ఏప్రిల్ 2023: తిరుపతిలోని స్విమ్స్‌ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో టిబి, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. టిటిడి ధర్మకర్తలమండలి సమావేశం శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.

– టిటిడి అవసరాలకు గాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్ తో చర్చించేందుకు టీటీడీ బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ సనత్ కుమార్, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కమిటీ ఏర్పాటు.

– అలిపిరి వద్ద గల మార్కెటింగ్‌ గోడౌన్‌ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు మరియు కోల్డ్‌ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు.

– గుంటూరుకు చెందిన దాత శ్రీమతి ఆలపాటి తారాదేవి రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి అందించేందుకు ఆమోదం.

– తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం.

– న్యూఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో ఆడిటోరియం అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్లు మంజూరుకు ఆమోదం.

– టిటిడి విద్యాసంస్థల్లో రెగ్యులర్‌ బోధనా సిబ్బంది నియామకానికి ఆమోదం. ఇప్పటికే పని చేస్తున్న కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం.

– ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం.

– తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు పనులను త్వరితగతిన పూర్తి చేసి జూన్ 15వ తేదీ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం.

– ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాం. ఏప్రిల్ 5న జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. టిటిడి అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి భక్తులకు అవసరమైన సదుపాయాలన్నీ చక్కగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారందరినీ అభినందిస్తున్నాను.

– ఎఫ్.సి.ఆర్.ఏ (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుండి విరాళాలు స్వీకరించడానికి టిటిడికి అనుమతి ఉంది.

ఈ అనుమతి 2020 జనవరికి ముగిసింది. దీనిని రెన్యువల్ చేసుకోవడానికి టిటిడి దరఖాస్తు చేసింది.

పలు దఫాలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరిగింది. ఎఫ్.సి.ఆర్.ఏ, రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టాల మధ్య ఉన్న సాంకేతిక కారణాల వల్ల విరాళాల డిపాజిట్లపై వచ్చే వడ్డీని చూపించడంలో కొన్ని అభ్యంతరాలు తెలిపారు. ఇది సాంకేతిక కారణం మాత్రమే.

ఎఫ్.సి.ఆర్.ఏ అధికారుల సూచన మేరకు త్వరగా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లించడం జరిగింది.

ఇందుకోసం చెల్లించిన రూ.3 కోట్ల సొమ్మును తిరిగి పొందడానికి కృషి చేస్తున్నాం.

మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.