BALALAYA MAHA SAMPROKSHANA BEGINS AT SRI VARAHASWAMY TEMPLE _ శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
 
తిరుమల, 2020 డిసెంబ‌రు 06: తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. డిసెంబ‌రు 10వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.

ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో 20 మంది ప్ర‌ముఖ రుత్వికులు 13హోమ‌గుండాల‌లో విశేష హోమాలు నిర్వ‌హించ‌నున్నారు.  

కాగా, ఆదివారంనాడు ఉదయం 7.00 నుండి 10.00 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన,  పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం,  వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

కళాకర్షణ :

రాత్రి 8.00 నుండి 10.00 గంటల వ‌ర‌కు  కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు.

డిసెంబ‌రు 7, 8, 9వ తేదీల్లో  :

– ఉద‌యం 7 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ర‌ల రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు విశేషహోమాలు, యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

డిసెంబరు 10న :

డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయ‌బ‌డిన రాగి రేకులు అమర్చేందుకు బాలాల‌యం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం పూర్త‌య్యే వ‌ర‌కు భ‌క్తుల‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి మూల విరామూర్తి ద‌ర్శ‌నం ఉండ‌దు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగు వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌చార్యులు, శ్రీ మోహ‌న రంగాచార్యులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ గోవింద‌రాజ దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

Tirumala, 6 Dec. 20: The holy fete of Balalaya Maha Samprokshana of Sri Varahaswami temple commenced on Sunday and is slated to conclude on December 10.

On Sunday morning the Archakas lighted the Homa Gundas in the yagashala and began vaidika activities like Punyahavachanam, Viswaksena Aradhana, Panchagavya Aradhana, Vaastu Homam, Raksha bandhanm etc.

KALAKARSHANA

As part of the Kalakarshana the Shakti of Mula idol of Sri Varaha swami is captured in Kumbha (kalasha) and taken to yagashala on Sunday evening.

DECEMBER 7,8,9 ACTIVITES

Special vaidika programs are performed in the yagashala both morning and evening at the Yagashala of the Sri Varahaswami temple.

Kankana Bhattar and Chief Priest Sri Venugopal Dikshitulu, Vaikhanasa Agama Advisors Sri NAK Sundara Varadan, Sri Mohana Rangacharyulu, Temple chief Archakas Sri Govindaraja Dikshitulu and Sri Sheshachala Dikshitulu, Rutwiks and officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI