MUSIC IS A MYSTIC MEDICINE FOR MENTAL AND PHYSICAL FITNESS _ సంగీతంతో శారీరక, మానసిక రుగ్మతలు దూరం : స్విమ్స్ వైస్ చాన్సలర్ డా. భూమా వెంగమ్మ

Tirupati, 4 March 2020: Music cures both mental and physical illness and keeps body fit, said Dr B Vengamma, Director of Sri Venkateswara Institute of Medical Sciences.

She was participating in the 60th anniversary celebrations of S.V Nadaswaram, Dolu School of Sri Venkateswara College of music and dance in Tirupati as chief guest. 

She said learning and practicing music instruments and performing arts like dance makes brain dynamic and keep all ailments at a distance. Contending that music was an effective solution to the stress in society she said students should practice any musical instrument from childhood itself.

Dr Akella Vibhishana Sharma Project head of SV higher Vedic Studies Institute said that skills and talent in singing and playing musical instruments gives both physical and spiritual strength.

The cultural programmes by students enthralled the audience.

Dr.S.Jamuna, Principal of SV College of Music and Dance College, Smt Suvarna, Sri Krishna Rao of SV Nadaswaram School, other faculty members participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

 

సంగీతంతో శారీరక, మానసిక రుగ్మతలు దూరం : స్విమ్స్ వైస్ చాన్సలర్ డా. భూమా వెంగమ్మ

ఘనంగా ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల 60వ వార్షికోత్స‌వం

తిరుపతి, 2020 మార్చి 04: సంగీతం శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తుందని, వైద్యశాస్త్రంలో ఇది నిరూపితమైందని స్విమ్స్ వైస్ చాన్సలర్ డా. భూమా వెంగమ్మ తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర నాద‌స్వ‌ర, డోలు పాఠ‌శాల 60వ వార్షికోత్స‌వం బుధవారం క‌ళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.వెంగమ్మ మాట్లాడుతూ గాత్రం, వాద్యం, నృత్యం లాంటి కళలను నేర్చుకుంటే మెదడు చాలా శక్తివంతంగా పని చేస్తుందన్నారు. మెదడు చైతన్యవంతంగా ఉంటే రుగ్మతలు దరిచేరవన్నారు. కావున విద్యార్థులకు బాల్యదశ నుండే ఏదైనా ఒక కళ తప్పక నేర్పించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి నివారణకు సంగీతం ఒక సాధనమన్నారు.

ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ మాట్లాడుతూ సంగీతం అభ్యసనం పూర్వజన్మ సుకృతమన్నారు. భగవంతుని ఆశీస్సులు ఉంటేగానీ కళలు నేర్చుకోవడం సాధ్యం కాదన్నారు. నాదస్వరం, డోలు వాయిద్యం శారీరక శ్రమతో కూడుకున్నవని, ఆలయాల్లో భగవంతుని ఆరాధనకు ఇవి కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు.

ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి లక్ష్మి సువర్ణ వార్షిక నివేదికను చదివి వినిపించారు.

ముందుగా మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి ‌సంగీత కార్యక్రమాలు ప్రారంభ‌మ‌య్యాయి. రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు వివిధ సంగీత, నృత్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్‌.జ‌మునారాణి, ఎస్వీ నాద‌స్వ‌ర పాఠ‌శాల అధ్యాపకులు శ్రీ కృష్ణారావు, కళాశాల అధ్యాపకులు శ్రీ సుధాకర్, శ్రీ వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.