TTD EO INSPECTS SRIVARI TEMPLE WORKS AT VIZAG _ విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో

విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో

తిరుపతి, 2020 మార్చి 04: విశాఖ‌ప‌ట్నంలోని రిషికొండలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను బుధ‌వారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ప‌రిశీలించారు. నిర్దేశిత వ్య‌వ‌ధిలోపు ప‌నులు పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ప్ర‌స్తుతం రూ.9 కోట్ల వ్య‌యంతో ప‌లు ప‌నులు చేప‌ట్టామ‌ని, ఇక్క‌డ శ్రీ‌వారి ఆల‌యంతోపాటు శ్రీ ల‌క్ష్మీదేవి, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి ఆల‌యాలు ఉన్నాయ‌ని తెలిపారు. మే నెల‌లో మ‌హాకుంభాభిషేకం నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ భ‌క్తుల వ‌స‌తి కోసం నిర్మాణాలు చేప‌ట్టే విష‌య‌మై రానున్న బోర్డు స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

ఈవో వెంట టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి తదిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. 

 

Tirumala, 4 March 2020: TTD Executive Officer Sri Anil Kumar Singhal on Wednesday inspected the ongoing works at Srivari temple in Visakhapatnam and instructed the engineering officials on certain improvements.

Speaking later the TTD EO said that TTD plans organising Maha Kumbhabhisekam in May next and spent Rs 9 crore on the Project to construct temples for Sri Lakshmi Devi and Sri Andal Ammavaru along with Srivari temple.

He said the next session of TTD board will decide on additional facilities for devotees.

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, Chief Engineer Sri Ramachandra Reddy, Srivari temple OSD Sri Pala Seshadri and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI