GOLDEN CHARIOT CHEERS DEVOTEES _ వైభవంగా స్వర్ణరథోత్సవం
Tirumala, 5 Oct. 19: The devotees were mused by the dazzling beauty of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi on the shining Swarnaratham on Saturday.
The mammoth 32 feet tall Golden Chariot weighing around 29 tonnes was pulled swiftly along four mada streets by pilgrims chanting Govinda… Govinda… with religious ecstasy.
Tens of thousands of pilgrims converged to witness the celestial fete that took place between 4pm and 5pm at Tirumala.
TTD Chairman Sri YV Subba Reddy, Chief Secretary of AP Sri LV Subrahmanyam, Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath and others took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
వైభవంగా స్వర్ణరథోత్సవం
అక్టోబరు 05, తిరుమల, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో మలయప్ప దర్శనమిచ్చారు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రథోత్సవంలో కూడా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ఏపీ సిఎస్ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ శ్రీరంగనాథ రాజు, టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.