SAKATASURAVADHA GUISE OF GODDESS FASCINATES DEVOTEES _ సర్వభూపాల వాహనంపై సకటాసుర వధ అలంకారంలో సిరుల‌త‌ల్లి

Tiruchanoor, 16 Nov. 20: On the sixth day morning on Monday as part of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, Goddess Sri Padmavathi Devi in the unique Sakatasuravadha guise on Sarva Bhoopala Vahanam and fascinated devotees.

Sakatasuravadha, killing the cart form demon is one of the important episodes in Sri Krishna Leela. On the Sarva Bhoopala Vahanam, Goddess is seen as kicking the “Sakatam”(Cart Wheel) with Her leg and there by implying weeding out the evil and protecting the good.

Both the Jiyar Swamijis of Tirumala, Ex-officio board member Dr C Bhaskar Reddy, JEO Sri P Basanth Kumar, CE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani, VGO Sri Bal Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సర్వభూపాల వాహనంపై సకటాసుర వధ అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి, 2020 నవంబరు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై సకటాసుర వధ అలంకారంలో కనువిందు చేశారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ.  సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.