YOGA NARASIMHA RIDES SIMHA VAHANA _ సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

Tirupati, 4 Mar. 21: Lord Kalyana Venkateswara as Yoga Narasimha blessed devotees on the ferocious Simha Vahanam on Thursday morning, as part of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram on the third day morning.

DyEO Smt Shanti, AEO Sri Dhananjeyulu, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayulu were also present in this vahana seva which was observed in Ekantam due to COVID restrictions.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుపతి, 2021 మార్చి 04: సింహ వాహనంపై యోగనరసింహుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు యోగనరసింహుని అలంకారంలో సింహ వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిష్టిస్తారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహన సేవ జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.