DHWAJAROHANAM PERFORMED _ శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహోత్సవాలకు వేడుకగా ధ్వజారోహణం

Tirupati, 4 Mar. 21: The annual brahmotsavams at Sri Kapileswara Swamy temple commenced with Dhwajarohanam in the auspicious Meena Lagnam at 7:34am on Thursday in Tirupati.

The Nandeeswara Dhwajapatham was earlier offered special pujas and Abhishekam was performed to Dhwajasthambham followed by Deeparadhana amidst chanting of Chaturvedas.

TTD EO Dr KS Jawahar Reddy, temple Dy EO Sri Subramanyam and other staffs participated.

In view of Covid, the Brahmotsava Vahana Sevas will be performed in Ekantam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహోత్సవాలకు వేడుకగా ధ్వజారోహణం

తిరుపతి, 2021 మార్చి 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం వేడుకగా ధ్వజారోహణం నిర్వహించారు.

ఆలయ ధ్వజస్తంభం వద్ద శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ధ్వజస్తంభానికి, నంది చిత్రపటానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఉదయం 7.34 గంటలకు మీన లగ్నంలో నందీశ్వరుడి చిత్రపటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేశారు. శ్రీ మణిస్వామి కంకణభట్టార్ గా వ్యవహరించారు.

ధ్వజస్తంభానికి విశేష అభిషేకం :

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.

టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, విజివో శ్రీ మనోహర్, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

ఆ తరువాత ఈవో శ్రీ కపిలేశ్వర, శ్రీకామాక్షి, శ్రీ గురు దక్షిణామూర్తి, శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు.

ప్రపంచం సుభిక్షంగా ఉండాలనే బ్రహ్మోత్సవాలు : ఈవో

ప్రపంచం సుభిక్షంగా ఉండి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చేస్తున్నామని ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.