ANKURARPANAM ON SEPTEMBER 18 FOR BRAHMOTSAVAMS _ సెప్టెంబర్ 18న శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirumala, 17 Sep. 20: The holy seed sowing fete – “Ankurarpanam” will be observed on September 18 between 6pm and 7pm in Tirumala and the Commander in Chief of Lord, Sri Viswaksena will be seated at the Ranganayakula Mandapam.

Ankurarpanam is a significant ritual in the Vaikhanasa Agama Shastra. It is a tradition of prayers for success before the commencement of any major festival. Performance of Ankurarpanam a day ahead of all festivals is a Agama standard practice followed at Tirumala and other Sri Vaishnavite temples. The unique feature of this fete is that the nursing of the Navadhanyas (nine types of seedlings) in different “Palikas”-mud pots is being done under the soothing rays of Moon on the penultimate day of Dhwajarohanam during annual Brahmotsavams.

DWAJAROHANAM ON SEPTEMBER 19:

On Saturday evening in the auspicious Meena lagnam between 6.03pm and 6.30pm ceremonial Dwajarohanam event will be observed. The same night the first of vahana Seva, Pedda Shesha vahana will be conducted between 8.30pm and 9.30 pm. 

It may be mentioned herein view of the ongoing Covid 19 restrictions, the annual brahmotsavams this year will be observed under Ekantam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబర్ 18న శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

సెప్టెంబరు 17, తిరుమల 2020: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. బ్ర‌హ్మోత్స‌వాల కోసం సెప్టెంబర్ 18న శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మ‌ధ్య‌ అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా శ్రీ విష్వ‌క్సేనుల వారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేస్తారు.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది.

సెప్టెంబర్ 19న ధ్వజారోహణం :

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 19వ తేదీ శ‌నివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ ఉంటుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.