SACRED DARBHA MAT AND ROPE PROCESSION HELD _ బ్రహ్మోత్సవాలకు దర్భ చాప, తాడు సిద్ధం,ధ్వజారోహణం కు ఇవే కీలకం

Tirumala, 17 Sep. 20: The procession of Darbha mat and rope which are used during the Dhwajorahanam ceremony during annual brahmotsavams was held in Tirumala on Thursday evening.

The annual brahmotsavams commences with the traditional Dhwajarohanam fete where this sacred “Darbha”, scientifically known as Desmotachya bipinnata, is a tropical grass, which is considered most pious in Vedic scriptures.

The mat and rope made of this holy grass are tied to the temple pillar and pujas are performed as per the tenets of Vaikhanasa Agama amidst the chanting of Vedic Mantras unfurling the Garuda flag atop the Dhwajasthambham heralding the beginning of annual brahmotsavams.

According to the DFO TTD Sri Chandra Sekhar, who after performing pujas to the sacred material, speaking to media said, the legends say that there are two types of Darbhas  – Shiva Darbha and Vishnu Darbha. In Srivari temple Vishnu Darbha is collected from Chellur near the Vadamalapeta region of the Chittoor district are used. After drying it in sun rays for a week, a 7×2 meters mat and 212 feet rope is readied for the holy Dhwajarohanam event by our staff who worked for 16 days and nights with utmost devotion”, he added.

Meanwhile, the Darbha mat and rope were handed over to Temple DyEO Sri Harindranath at Srivari temple and placed atop the Seshavahnama located in Ranganayakula Mandapam.

DyEO Panchayat and Revenue, Garden Deputy Director Sri Srinivasulu, AVSO Sri Gangaraju, Sri Venkataramana, Sri Veerababu, FRO Sri Prabhakar Reddy were also present in the procession.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బ్రహ్మోత్సవాలకు దర్భ చాప, తాడు సిద్ధం

ధ్వజారోహణం కు ఇవే కీలకం

తిరుమల, 17 సెప్టెంబరు 2020: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా నిర్వహించే ధ్వజారోహణంకు దర్భ చాప, తాడు సిద్ధమయ్యాయి. ఈ క్రతువుల్లో దర్బచాప, తాడు అతిముఖ్యమైనవి.

బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం  మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు.దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో  విష్ణు దర్బ ఉపయోగిస్తున్నారు.

ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంటకాలువల మీద పెరిగే ఈ దర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరిస్తారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్బను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు. ధ్వజారోహణం కు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి.  అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది.  టీటీడీ డి ఎఫ్ ఓ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వచ్చి వీటిని ఆలయ డిప్యూటీ ఈవో  శ్రీ హరీంద్రనాథ్ కు  అందిచారు. ఈ నెల 19వ తేదీ జరిగే ధ్వజారోహణం లో వీటిని ఉపయోగిస్తారు.                              

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.