GRANDEUR AND GAIETY MARKS “ADIVO ALLADIVO” FINALE _ అన్నమయ్య సంకీర్తనలన్నీ వెలికితీసేందుకు కృషి చేస్తాం _ – అదివో అల్లదివో విజయోత్సవ సభలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUPATI, 24 AUGUST 2022: The prime motto of TTD to commence the ‘Adivo Alladivo’ programme is to bring many other Sankeertanas penned by Saint Poet and Padakavita Pitamaha, Sri Tallapaka Annamacharya, to the public fore with new talented youth, said TTD Chairman Sri YV Subba Reddy.

The Trust Board Chief took part in the Samapanotsavam of the nine-month old popular SVBC musical talent program, “Adivo Alladivo”as Chief Guest held at Mahati Auditorium in Tirupati on Wednesday evening.

Speaking on the occasion, the TTD Chairman said this unique program commenced during December last and in 35 episodes about 138 talented youth aged between 15 years and 25years participated from different parts of the country and even overseas enthusiastically to showcase their talents. He said, TTD will contemplate to conduct similar programmes in other major cities of Andhra Pradesh too in the future.

Versatile veteran playback singer of South Indian movies, Octogenarian, Gana Kokila, Padma Bhushan Dr P Susheela in her enlightening message blessed all the contestants for their mellifluous performances. She remembered renowned playback singers, Ghantasala Venkateswara Rao, the only person who got an opportunity to present his song at Bangaru Vakili in Tirumala temple and late Sri SP Balasubramaniam for pioneering the musical talent programmes giving the musical world its best singers. The Nightingale of South also complemented TTD for having designed such a wonderful programme like “Adivo Alladivo” and providing a new platform to young talents. 

Another stalwart of Carnatic music, Kalaimamani Dr Sudha Raghunathan said, Annamaiah needs to be owned by all youngsters of today’s generation. She blessed all the contestants who mesmerised everyone with their talents and wished them to shine like stars in the sky.

Music Director Sri Vidyasagar in his message said, the most talented youth have been identified with this unique program. “Music is an ocean. All the participants should emerge as the country’s best singers by practicing this traditional art with dedication”, he wished.

One of the Judges of the program, renowned playback singer Smt SP Sailaja said this is a unique program aimed to bring to the limelight the new songs of Annamacharya. She said she was blessed for having given the opportunity to judge the programme from the past nine months that could become a reality only by the will of Sri Venkateswara.

TTD Asthana Vidhwan Dr Balakrishna Prasad said participation is more important than winning in this program and every contestant is a winner as they all received this divine opportunity with the benign blessings of Lord Venkateswara.

Earlier, Dr Saikrishna Yachendra, the Chairman of SVBC in his presidential remarks thanked all the judges for selecting the gems in the programme. He also said, every participant was a winner in this unique programme as it was organized by the wish of none other than the Universal Supreme Lord Sri Venkateswara. While CEO SVBC Sri Shanmukh Kumar took forward the proceedings of the programme.

Later, the top three winners including, First place-Kum Asrita, Second Place-Kum. Sridhruti and Third place-Sri Karthikeya were felicitated and given away prize amount of Rs.50thousands, Rs.30thousands and Rs.20thousands along with the portrait of Srivaru by the luminaries on the stage on the occasion.

Besides, all the nine participants who came to finals were also felicitated by TTD Chairman Sri YV Subba Reddy and others.

JEO (H & E) Smt Sada Bhargavi, CVSO Sri Narasimha Kishore were also present. Among other senior officers, CAuO Sri Sesha Sailendra, Annamacharya Project Director Dr Visbhishana Sharma and others were also present.

The entire Mahati Auditorium was filled music lovers on the pleasant evening who cheered all the participants with huge applause for their impeccable talents.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నమయ్య సంకీర్తనలన్నీ వెలికితీసేందుకు కృషి చేస్తాం

– అదివో అల్లదివో విజయోత్సవ సభలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 24 ఆగస్టు 2022: శ్రీ‌మాన్ తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల‌వారు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని కీర్తిస్తూ ర‌చించిన 32 వేల సంకీర్తనల్లో 14 వేల సంకీర్తనలు వెలుగుచూశాయని, వీటిని స్వర పరచి ప్రజా బాహుళ్యం లోకి తీసుకు వెళ్ళడంతో పాటు మిగిలిన సంకీర్తనలను కూడా వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

అన్నమాచార్య సంకీర్తనలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి ఎస్వీబీసీ ద్వారా టీటీడీ రూపకల్పన చేసిన అదివో అల్లదివో కార్యక్రమ విజయోత్సవ సభ బుధవారం రాత్రి మహతి ఆడిటోరియంలో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
అన్నమయ్య సంకీర్త‌న‌లను మ‌రింత విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకుని పోయే ల‌క్ష్యంతో టీటీడీ, శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ద్వారా అదివో అల్ల‌దివో కార్య‌క్ర‌మాన్ని రూపొందించిందన్నారు. సంగీత ప్ర‌ధానంగా సాగే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేవారు అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన సంకీర్త‌న‌లు మిన‌హాయించి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రికార్డు చేసిన సంకీర్త‌న‌లు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌పించారని చెప్పారు.
15 నుండి 25 సంవత్సరాల వ‌య‌స్సు గ‌ల యువతీ, యువకులు అన్నమయ్య సంకీర్తనలను పోటీపడి ఆలపించారని ఆయన తెలిపారు. 2021, డిసెంబ‌రు 6వ తేదీ మొద‌టి విడ‌త పోటీలు మ‌హ‌తిలో ప్రారంభించామని అన్నారు.

నేటి తరాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించాలనే సత్సంకల్పంతో పోటీల కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.

అన్నమాచార్య సంకీర్తనలలోని సంగీత, సాహిత్య, భక్తి అంశాలలోని మాధుర్యాన్ని నేటి యువతీ, యువకులకు అందించేందుకు ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు.

శ్రీ తాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనల్లో ఇంకా మిగిలిపోయిన వాటిని త్వరితగతిన పరిష్కరించి, రికార్డు చేసి భక్తజన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

అన్నమాచార్య సంకీర్తనలకు అర్థతాత్పర్యాలపై లోతైన విశ్లేషణ చేసి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కృషి జరుగుతోందని చైర్మన్ చెప్పారు.
మొత్తం 35 ఎపిసోడ్లతో రూపొందించిన ఈ కార్యక్రమంలో 138 మంది గాయ‌నీ గాయ‌కులు పాల్గొన్నారనీ వీరందరూ చక్కని ప్రతిభ కనబరచారని ఆయన అభినందించారు.

తొమ్మిది మంది గాయ‌నీ గాయ‌కుల‌ను ఫైనల్‌ పోటీలకు ఎంపిక చేయగా, ఇందులో ముగ్గురు విజేతలుగా నిలిచారన్నారు.

గాయ‌నీ గాయ‌కుల ఎంపిక నుంచి కార్య‌క్ర‌మం ప్ర‌సారం వ‌ర‌కు ఎస్వీబిసి చైర్మ‌న్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర‌ ఎంతో శ్ర‌ద్ధ చూపారని ప్రశంసించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న విశేష ఆద‌ర‌ణ దృష్ఠ్యా మ‌రింత‌గా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ప్ర‌జా బాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళ‌డానికి టీటీడీ ప్ర‌య‌త్నం చేస్తోందని తెలిపారు.

ఎస్ వి బి సి చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ, అదివో అల్లదివో ప్రారంభం మాత్రమేనని చెప్పారు.

ఈ సంకీర్తన మహాయజ్ఞంలో ఎంతో మంది మహానుభావులు అన్నమయ్య సంకీర్తనలు స్వరపరిచి వాటి ప్రాచుర్యానికి దోహదపడ్డారు అని చెప్పారు. ప్రతి ఒక్కరి నోట అన్నమయ్య పాట పలికేలా సంగీత యాత్ర కొనసాగిస్తామని చెప్పారు.

అదృష్టం ఘంటసాల కే దక్కింది : శ్రీమతి సుశీల

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ శ్రీమతి పి సుశీల మాట్లాడుతూ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో కూర్చుని ఆయనపై పాట పాడే అదృష్టం శ్రీ ఘంటసాల కు మాత్రమే దక్కిందన్నారు. ప్రపంచమే హద్దుగా ఎస్వీబీసీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతోందని అభినందించారు. దివంగత శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎందరో నూతన గాయకులను వెలుగులోకి తెచ్చారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని ఆమె చెప్పారు. స్వామి వారి నామ సంకీర్తన పలకడం తన పూర్వ జన్మ సుకృతమని శ్రీమతి సుశీల చెప్పారు.

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ శ్రీమతి సుధా రఘునాథన్ మాట్లాడుతూ, అదివో అల్లదివో కార్యక్రమానికి హాజరు కావడం వేంకటేశ్వర స్వామి తనకు ఇచ్చిన అదృష్ఠంగా భావిస్తున్నానన్నారు.

యువకులకు కూడా అన్నమయ్య సంకీర్తనలు సుపరిచితం అయ్యేలా గొప్ప కార్యక్రమాన్ని ఎస్వీబీసీ నిర్వహించిందని చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి అవకాశం ఇస్తే మహతి లో సంకీర్తనలు పాడాలని ఉందని ఆమె చెప్పారు.

ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ విద్యాసాగర్ మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తెచ్చి కొత్త గాయకులను ప్రోత్సహించడం గర్వకారణమని చెప్పారు.

ప్రముఖ గాయని శ్రీమతి ఎస్పీ శైలజ మాట్లాడుతూ, అదివో అల్లదివో కార్యక్రమం తొలి నుంచి చివరి దాకా తాను పాల్గొనడం స్వామివారి అనుగ్రహమని చెప్పారు. సినిమా పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించడం సులువైన విషయమనీ, ప్రచారంలో లేని అన్నమయ్య సంకీర్తనలు పాడి ప్రజలను మెప్పించడం చాలా కష్టమైన పని అని ఆమె చెప్పారు.

టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, తాను ఈ కార్యక్రమం ప్రారంభకుల్లో ఒకనిగా ఉండటం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులు అందరూ చక్కగా పాడారని ఆయన చెప్పారు. కొత్త సంకీర్తనలను జనంలోకి తీసుకుపోవడానికి టీటీడీ చేసిన ప్రయత్నం గొప్పదని చెప్పారు . కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, ఎస్వి బి సి సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్ , శ్రీమతి రామలక్ష్మి, విశేష సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు.

అనంతరం ఎస్వీబీసీ ఆధ్వర్యంలో అతిథులందరినీ ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.

విజేతలకు బహుమతి ప్రధానం

అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనల మొదటి స్థానంలో నిలిచిన కుమారి ఆశ్రిత రెండవ స్థానంలో నిలిచిన కుమారి శ్రీ ధృతి, మూడో స్థానంలో నిలిచిన చిరంజీవి కార్తికేయ కు అతిథులు నగదు బహుమతులతో పాటు స్వామివారి చిత్ర పటాలు సర్టిఫికెట్ అందించి శాలువాతో సత్కరించారు. రన్నరప్ గా నిలిచిన కుమారి మోనీషా, కుమారి అనూష, కుమారి శ్రీశృతి, కుమారి లక్ష్మీ శైలజ, కుమారిశ్రీ వైష్ణవి దేవి, కుమారి నమ్రత ను సన్మానించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది