TTD TEMPORARILY SUSPENDS SARVA DARSHAN TOKENS FROM APRIL 12 ONWARDS _ సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Tirumala, 7 Apr. 21: In view of the spike in Covid cases across the country in recent times, TTD has announced that it will suspend the issue of Sarva Darshan tokens at Tirupati from April 12 onwards i.e. SD tokens will be issued till the evening of April 11 only.

In a statement on Wednesday TTD said Covid cases were on the spurt again in Tirupati city. Since thousands of devotees have to wait at Bhudevi complex and Vishnu Nivasam for time slot tokens the prospect of Covid cases is likely to increase.

With the spurt in Covid cases from the last few days, the Shirdi temple in Maharashtra has already suspended Darshan. As in Tirupati also the Covid cases are increasing, TTD has taken this decision of dispensing with SSD tokens in Tirupati from Monday onwards.

TTD said the above decision was taken keeping in view of the health safety of devotees and any resumption of tokens in future will be formally announced.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సోమవారం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమ‌ల‌, 07 ఏప్రిల్, 2021: దేశంలో కోవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. అనగా ఆదివారం (11-4-2021) సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు.

కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విష‌యం విదిత‌మే. తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్ర‌మేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది.

ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. తదుపరి టోకెన్లు ఎప్పుడు జారీ చేసేది ముందుగా తెలియజేయడం జరుగుతుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.