TTD MULLS CONSERVATION OF INDIGENOUS SPECIES IN SESHACHALA RANGES _ తిరుమలలో ప‌ర్యా‌వ‌ర‌ణ ప‌రిరక్షణ కోసం భారీగా స్వ‌దేశీ మొక్క‌ల పెంప‌కానికి చర్యలు

TO TAKE UP MASSIVE PLANTATION ACTIVITY FOR THE PROTECTION OF TIRUMALA ENVIRONS

ACACIA TO BE REPLACED WITH USEFUL INDIGENOUS TREES 

Tirumala, 7 Apr. 21: With an aim to conserve the rich green vegetation and to preserve the biodiversity of the Seshachala ranges, TTD is contemplating a massive plantation programme soon.

Under the instructions of Executive Officer Dr KS Jawahar Reddy, the DFO of TTD Sri Avula Chandrasekhar has chalked out a detailed action plan to take up the plantation programme in the Seshachala ranges.

During the PowerPoint presentation held at the Chambers’ of EO in TTD Administrative Building in Tirupati on Wednesday with DFO, the EO directed him to take opinions of experts to grow indigenous plant breeds in the place of the Acacia which has spread its tentacles ruthlessly affecting the biodiversity of Tirumala forests.

ACACIA PLANTATION

Going back to history, the plantation of Acacia auriculiformis (Tumma) happened in 1983. Being a plant breed of Australia, Acacia which has a history of around 50years across the world was considered as a fast-growing species as it consumes less water and grows fast even on rocky patches as well in deserts. However, over a period, biologists across the world realized that this species has critically disturbed other flora, fauna and aves and almost many countries have now banned the growth of Acacia. 

CONCERNS OF DEPLETING VEGETATION

During his inspection in the areas of Dharmagir, Kumaradhara-Pasupudhara wilds, TTD EO has noticed a meagre growth of plant species, movement of birds, animals etc. wherever there is Acacia plantation and called for an expert opinion to know the reason. 

Accordingly Dr. B.M.K. Reddy, Chairman, Andhra Pradesh State Biodiversity and a few other professors were approached who gave alarming facts over the depletion of greenery in Seshachala ranges.

SOME ALARMING FACTS ABOUT ACACIA

The experts stated Acacia was grown in about 890hectares in the Tirumala Seshachala forest cover. 

As its Ph value is standing between 4.4 and 4.5, because of this high acidity, no other plants are germinating besides Acacia. 

No animal or bird can feed on Acacia. Even the honey bees cannot transport the nectar from its pollen which is ultimately resulting in the hindrance of other plants and affecting animal life as well.

Apart from this Acacia is fast-growing species after bamboo and easily attracts fire and has no wind tolerance because of its lateral roots.

Because of the widespread Acacia in the last three and a half decades, nearly 76 creepers, 49 plant species have joined the endangered list, which is an alarming situation, which is impacting on greenery, ecology and wildlife of Tirumala.

OVERCOMING THE DANGEROUS SITUATION

To overcome this alarming situation, TTD has decided to extensively grow indigenous plant species in the place of Acacia. The forest wing officials have identified over 994 varieties of plant species in the place of Acacia.

Plans are anvil to grow Ficus religiosa (Raavi), Ficus bengalensis (Marri), Ficus virens (Juvvi), Magnolia champaca (Sampangi), Madhuka longifolia (Ippa), Terminalia arjuna (Maddi), Syzygium cumini (Neredu), Albizia lebbek (Chinduga), Limonia acidissima (Velaga) and many more replacing Acacia.

According to DFO Sri Chandrasekhar, of 890hectares where Acacia has spread, 240hectares will be retained while the remaining 650hectares will be replaced with other Indigenous species in a phased manner. He said the entire project is projected at around Rs.20crores. During the first phase in 2021-22, the plantation activity will be taken up in 80hectares of land.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో ప‌ర్యా‌వ‌ర‌ణ ప‌రిరక్షణ కోసం భారీగా స్వ‌దేశీ మొక్క‌ల పెంప‌కానికి చర్యలు
 
–  తుమ్మ స్థానంలో ఉపయోగకరమైన స్వదేశీ వృక్ష సంప‌ద, ఔష‌ధ భాండా‌గారాన్ని అభివృద్ధి చేయాలి  – టిటిడి ఈవో

తిరుపతి, 2021 ఏప్రిల్ 07: క‌లియుగ వైకుంఠ‌మైన తిరుమ‌ల‌ శేషాచ‌ల అడ‌వుల‌లో  వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని  పరిరక్షించేందుకు భారీగా స్వదేశీ అట‌వీ వృక్ష సంప‌ద‌ను ఏర్పాటు చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో బుధ‌వారం ఉద‌యం డిఎఫ్‌వో శ్రీ ఏ.చంద్ర‌శేఖ‌ర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శేషాచ‌ల అడ‌వులలోని వివిధ జాతుల మొక్క‌ల గురించి ఈవోకు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శేషాచ‌ల అడ‌వుల‌లోని ఆస్ట్రేలియా తుమ్మ మొక్క‌ల స్థానంలో స్వదేశీ జాతుల  మొక్కలను పెంచడానికి నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మ మొక్క‌లు  తిరుమల అడవుల జీవవైవిధ్యాన్ని అస్తిర‌త ప‌రుస్తున్నాయ‌న్నారు. అన్ని ర‌కాల గ‌డ్డి జాతులు, పొద‌లు, తీగ‌జాతి, వృక్ష‌జాతి మొక్క‌లను భారీగా ‌పెంచ‌డానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల‌న్నారు. గ‌తంలో జ‌రిగిన పొర‌పాటును నివారించ‌డంలో భాగంగా ప్ర‌జ‌లు, శాస్త్ర‌వేత్త‌ల స‌హాకారంతో ద‌శ‌ల వారిగా రాబోవు 10 సంవ‌త్స‌రాల్లో ఆస్ట్రేలియా తుమ్మ మొక్క‌ల స్థానంలో స్వ‌దేశీ జాతుల మొక్క‌లు పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  

తిరుమ‌ల‌లో ఆస్ట్రేలియా తుమ్మ మొక్క‌ల చ‌రిత్ర‌   :

 శేషాచ‌ల అడ‌వుల‌లో తుమ్మ తోట‌ల పెంప‌కం 1983వ సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైంది. ఆస్ట్రేలియా మొక్కల జాతికి చెందిన తుమ్మ‌ ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగింది. రాతి నేల‌లు, ఏడారుల‌లో తుమ్మ చెట్లు తక్కువ నీటితో పెరుగుతున్నందున వేగంగా అభివృద్ధి చెందే జాతిగా పరిగణించబడింది. ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్రవేత్తలు ఈ జాతి మొక్క‌లు ఇతర వృక్షజాలం, జంతుజాలాల‌ను తీవ్రంగా దెబ్బతీశాయ‌ని గుర్తించి అనేక దేశాలు ఇప్పుడు తుమ్మ మొక్క‌ల పెంప‌కాన్ని నిషేధించాయి.

ధర్మగిరి, కుమారధార-పసుపుధార అడవులలో ఈవో త‌నిఖీలు నిర్వ‌హించ‌గా తుమ్మ మొక్క‌లు ఉన్నచోట ఇత‌ర జాతుల మొక్క‌ల పెరుగుదల లేద‌ని, పక్షులు, జంతువుల కదలికలు లేక‌పోవ‌డాన్ని గమనించి, కారణాన్ని తెలుసుకోవడానికి నిపుణుల అభిప్రాయాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య ఛైర్మన్ డాక్ట‌ర్ డి.ఎమ్‌.కె.రెడ్డి, మరికొందరు ప‌రిశోధ‌కులు శేషాచల అడ‌వుల‌లో పచ్చదనం క్షీణించడానికి తుమ్మ చెట్లు కార‌ణ‌మ‌ని నివేదిక‌లో వివ‌రించారు.

తుమ్మ మొక్క‌ల గురించి వారు పేర్కొన కొన్ని వాస్తవాలు :

–       తిరుమల శేషాచల అటవీ విస్తీర్ణంలో సుమారు 890 హెక్టార్లలో తుమ్మ చెట్ల‌ను పెంప‌కం జ‌రిగింది.

–       దాని పిహెచ్ విలువ 4.4 మరియు 4.5 మధ్య ఉన్నందున, ఈ అధిక ఆమ్లత కారణంగా సార‌వంత‌మైన నేల‌లను నాశ‌నం చేస్తుంది.

–      తుమ్మ మొక్క‌లను జంతువులు లేదా పక్షులు ఆహారంగా తీసుకోవు. తేనెటీగ కూడా దాని పుప్పొడి నుండి తేనెను రవాణా చేయదు, ఇది చివరికి ఇతర మొక్కలకు ఆటంకం కలిగిస్తుంది మరియు జంతువుల జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

–      అంతేకాకుండా తుమ్మ మొక్క‌లు వెదురు తర్వాత వేగంగా పెరుగుతున్న జాతులు. అది తేలికగా అగ్నిని ఆకర్షించి అగ్ని ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతుంది.

–       గత మూడున్నర దశాబ్దాల్లో శేషాచ‌ల అడ‌వుల‌లో విస్తృతంగా పెరిగిన తుమ్మ‌ కారణంగా, దాదాపు 76 తీగ జాతు‌లు, 49 మొక్కల జాతులు అంతరించిపోతున్న జాబితాలో చేరాయి. ఇది తిరుమల పచ్చదనం, జీవావరణ శాస్త్రం మరియు అడవి జీవితంపై ప్రభావం చూపుతున్న భయంకరమైన పరిస్థితి.

ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమించడం :

ప్రమాదకరమైన పరిస్థితిని అధిగమించడానికి, తుమ్మ‌ స్థానంలో దేశీయ మొక్కల జాతులను విస్తృతంగా పెంచాలని టిటిడి నిర్ణయించింది. తుమ్మ‌ స్థానంలో 994 రకాల మొక్కల జాతులను అటవీ విభాగం అధికారులు గుర్తించారు. ఇందులో ఫికస్ రిలిజియోసా (రావి), ఫికస్ బెంగాలెన్సిస్ (మర్రి),
ఫైకస్ వైరెన్స్ (జువ్వి), మాగ్నోలియా ఛంప‌కా (సంపంగి), మధుకా లాంగిఫోలియా (ఇప్పా), టెర్మినాలియా అర్జున (మడ్డి), సిజిజియం క్యుమిని (నేరేడు), లిమోనియా యాసిడిసిమా (వెలగ) త‌దిత‌రాలున్నాయి.

టిటిడి డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ తుమ్మ చెట్లు వ్యాప్తి చెందిన 890 హెక్టార్లలో  650 హెక్టార్లలో స్వ‌దేశీ జాతి మొక్క‌ల‌తో దశలవారీగా ఏర్పాటు చేస్తామ‌న్నారు. మిగిలిన 240 హెక్టార్లలో తుమ్మ‌ను అలాగే ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వ్య‌యం మొత్తం రూ.20 కోట్లుగా అంచనా వేసిన‌ట్లు చెప్పారు. మొదటి దశలో 2021-22లో 80 హెక్టార్ల భూమిలో స్వ‌దేశీ జాతుల మొక్క‌లు పెంచుతామ‌న్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.