HANUMAN JAYANTI FESTIVITIES CONCLUDES IN TIRUMALA _ హనుమంతుడు కార్యశూరుడు : శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతి స్వామి

TIRUMALA, 18 MAY 2023: The five-day Hanuman Jayanti festivities concluded on a grand religious note in Tirumala.

 

On the last day in Nada Neerajanam, Pushpagiri Peethadhipathi from Hyderabad Sri Vidyasankara Bharati Swamy in his religious discourse described Hanuman as a “Task Achiever” and stood as a role model to many. “Wherever Ramanama is worshipped, there Hanuma will appear and protect His devotees”, he maintained.

 

Dharmagiri Veda Vignana Peetham scholar Sri Maruti, Annamacharya Project Director Sri Vibhishana Sharma and others were also present.

 

At Anjanadri Balanjaneya temple in Akasaganga, the devotional programmes by TTD attracted the devotees.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హనుమంతుడు కార్యశూరుడు : శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతి స్వామి

– ముగిసిన హనుమజ్జయంతి ఉత్సవాలు

తిరుమ‌ల‌, 2023 మే 18: రామకార్యం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటుకుని, రాక్షస సంహారం చేసి లంకలో సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమంతుడు కార్యశూరుడు అని హైదరాబాదులోని పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతి స్వామి అన్నారు. తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు నాదనీరాజనం వేదికపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు.

హనుమంతుడు గొప్ప ఉపాసకుడని, ఈ కారణంగానే గొప్ప సుగుణాలు అలవడ్డాయని, ఆయన ముఖం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేదని చెప్పారు. తల్లి అంజనాదేవి పేరుని తన పేరుగా పెట్టుకుని ఆంజనేయుడు అయ్యాడని చెప్పారు. హనుమంతుడి బలపరాక్రమాలపైన రాముడికి ఎంతో నమ్మకం ఉందని, రాముడు ఆదేశించగానే లక్ష సాధన కోసం బయలుదేరారని వివరించారు. హనుమంతుని దృక్కోణంలో చూస్తే రామాయణం మొత్తం నేటి సమాజానికి అర్థమవుతుందన్నారు. రాముడిని ఎక్కడ కీర్తిస్తే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతారని, వీరిది విడదీయరాని అనుబంధమని చెప్పారు.

అంతకుముందు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ పివిఎన్ఎన్.మారుతి హనుమంతుడు సాధించిన విజయాలు అనే అంశంపై ఉపన్యసించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ పాల్గొన్నారు.

ఆకాశ‌గంగ‌లో ఆక‌ట్టుకున్న సంగీత కార్యక్రమాలు

హ‌నుమ‌జ్జ‌యంతిని పుర‌స్క‌రించుకుని గురువారం ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉదయం 9 నుండి మధ్యాహ్నం 10.30 గంటల వ‌ర‌కు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు భజనలు చేశారు. ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు హనుమ సంకీర్తనలు గానం చేశారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన కార్యక్రమం జరిగింది.

జ‌పాలి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉద‌యం 8.30 నుండి 10.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ ఉదయభాస్కర్ బృందం హనుమన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10.45 నుండి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుండి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హ‌రిక‌థా పారాయణం జరిగింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.