SRI GT MAHA SAMPROKSHANAM FROM MAY 21-25 _ మే 21 నుండి 25వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మ‌హాసంప్రోక్ష‌ణ

Tirupati,18 May 2023: TTD is organising a grand Maha Samprokshana of Sri Govindarajaswami temple from May 21-25 with Ankurarpanam on May 20.

This cleansing ritual as per agamas will be observed in connection with the completion of the gold plating works of the temple Vimana Gopuram which commenced on September 14 in 2021.

On May 21, the Punyahavachanam, Raksha Bandhanam will be performed in the morning at the Yagashala followed by Srivari Kalakarshanam in the evening. Other Vaidika programs will be performed at Yagashala both morning and evening on May 22 and 23.

On May 24 morning the rituals including Jaladivasam, Bimbasthapana and in the evening Maha Shanti Thirumanjanam and other yagashala programs will be held.

On May 25 the Kumbharadhana, Nivedana, Homas, Maha  Purnahuti, and Maha Samprokshanam rituals will be performed in the auspicious Mithuna lagnam between 7.45 am and 9.15 am.

Thereafter Akshatarohanam, Archaka bahumanam will be held and devotees will be allowed for Darshan from 10.30am onwards. In the evening the Pedda Sesha vahana Seva is performed on the temple Mada streets to bless devotees.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 21 నుండి 25వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మ‌హాసంప్రోక్ష‌ణ

– మే 20న మహాసంప్రోక్షణకు అంకురార్ప‌ణ

తిరుపతి, 2023 మే 18: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు మే 21 నుండి 25వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. మే 20న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సేనాపతి ఉత్సవం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన‌ రాగి రేకులు అమర్చేందుకు 2021 సెప్టెంబ‌రు 14న ప‌నులు ప్రారంభించారు. విమాన గోపురం ప‌నులు పూర్తి కావ‌డంతో జీర్ణోద్ధ‌ర‌ణ, మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టారు. ఇందులో భాగంగా మే 20వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం నిర్వ‌హిస్తారు.

మే 21న ఉద‌యం 8.30 నుండి 11 గంట‌ల‌ వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేప‌డ‌తారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీవారి కళాకర్షణం, కుంభములు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, పరివార దేవతలు యాగశాలకు వేంచేపు చేస్తారు.

మే 22 , 23వ తేదీల్లో ఉద‌యం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మే 24న ఉద‌యం 8 నుండి మధ్యాహ్నం 12 గంట‌ల వరకు జ‌లాధివాసం, బింబ స్థాపన, మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8.30 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

మే 25న ఉద‌యం 4 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, ఉద‌యం 7.45 నుండి 9.15 గంట‌ల వ‌ర‌కు మిథున ల‌గ్నంలో మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత అక్ష‌తారోహ‌ణం, అర్చ‌క బ‌హుమానం అందిస్తారు. ఉద‌యం 10.30 గంటల నుండి భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.