JEO REVIEWS ON NARAYANAVANAM BRAHMOTSAVAMS _ మే 31 నుండి నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు- ఏర్పాట్లపై అధికారులతో జేఈవో సమీక్ష 

TIRUPATI, 18 MAY 2023: In connection with annual brahmotsavams in Narayanavanam temple from …TTD JEO Sri Veerabrahmam held an inspection in the temple on Thursday along with the officials concerned.

 

The annual nine-day festival will commence on May 31 with Ankurarpanam on May 30 and conclude on June 8 with important days including Garuda Seva on May 4, Rathotsavam and Kalyanam on June 7 and Chakra Snanam on June 8. 

 

During the review meeting held in the temple premises with the officials of various departments, the JEO instructed them to make elaborate arrangements especially to develop gardens and ambience all along the Pushkarini. He also instructed the electrical department officials to make attractive illumination and the concern department to make floral decorations in a befitting manner.

 

The JEO also reviewed on the civil works, medical, security arrangements etc. He later instructed to arrange devotional cultural programmes in an attractive way all through the annual festival.

 

SEs Sri Satyanarayana, Sri Venkateswarulu, DyEO Smt Nagaratna, EE Sri Manoharam, GM Transport Sri Sesha Reddy, DFO Sri Srinivasulu, DPP Secretary Sri Srinivasulu, and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 31 నుండి నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

-. ఏర్పాట్లపై అధికారులతో జేఈవో సమీక్ష

తిరుపతి, 2023 మే 18: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామని జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణపై గురువారం సాయంత్రం నారాయణవనం ఆలయంలో ఆయన సమీక్ష జరిపారు.

ఈ సందర్బంగా జేఈవో మీడియాతో మాట్లాడారు . శ్రీపద్మావతి అమ్మవారి జన్మస్థలమైన నారాయణ వనంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో జూన్ 4వ తేదీ గరుడ వాహనం, 7వ తేదీ రథోత్సవం కల్యాణోత్సవం జరుగుతాయని అన్నారు. ఈ రెండు రోజుల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారన్నారు. భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఏర్పాట్లపై సమీక్ష

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని జేఈవో శ్రీవీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు .

గరుడ వాహనం, రథోత్సవం, స్వామివారి కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈరెండు రోజులు భద్రత, వైద్య సేవల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జేఈవో ఆదేశించారు . వాహనాలు, రథం ఫిట్నెస్ పరిశీలించాలని ఆదేశించారు. ఆలయంతో పాటు పరిసరాల్లో పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేయాలన్నారు. గటాటోపం, ఆలయంలో రంగవల్లులు, విద్యుత్ అలంకరణలు ఆకట్టుకునేలా చేయాలన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్వీ బీసి లో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రోమోలు ప్రసారం చేయాలని శ్రీవీరబ్రహ్మం చెప్పారు.

అనంతరం ఆయన ఆలయం ఎదురుగా ఉన్న పురాతన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఉన్న బావిని పరిశీలించి ఇక్కడి బావి, వాటర్ ట్యాంకు శుభ్రం చేయాలని ఆదేశించారు. పుష్కరిణి లో చెత్తను తొలగించి శుభ్రం చేయాలన్నారు.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్బంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఎస్ఈ లు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, రవాణా విభాగం జి ఎం శ్రీ శేషారెడ్డి ,పీఆర్వో డాక్టర్ రవి, డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, డిఎఫ్వో శ్రీ శ్రీనివాస్, విజివో శ్రీమనోహర్ , ఈఈ శ్రీమనోహర్, డిప్యూటీఈఈ శ్రీరాఘవయ్య, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ నర్మద, డాక్టర్ కుసుమ కుమారి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.