DEVOTEES WITH TICKETS ALONE WILL BE ALLOWED FOR DARSHAN-TTD EO _ టికెట్లు, టోకెన్లు ఉన్నవారే తిరుమలకు రండి – భక్తులకు టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి విజ్ఞప్తి
Tirumala, 23 Dec. 20: Only devotees with tickets are alone allowed for the Darshan of Lord Venkateswara Tirumala, said TTD EO Dr KS Jawahar Reddy.
After inspecting the arrangements in Tirumala on Wednesday talking to media persons, he said TTD has already made it clear that only devotees who have tickets and tokens for Vaikuntadwara Darshan will be allowed to go to Tirumala from Alipiri. “Due to prevailing conditions of covid-19, we already issued two lakh Rs. 300 Darshan tickets in online and going to issue 1 lakh tickets in offline on December 24 in Tirupati. We will allow only those devotees with tickets and tokens to enter Tirumala. We are again appealing to devotees not to come to Tirumala without tickets or tokens”, he reiterated.
Earlier, he inspected the arrangements at VQC 1, 2, ATC circle, Supadham, Rs300 entry point etc. along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, Deputy EO Srivari temple Sri Harindranath were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టికెట్లు, టోకెన్లు ఉన్నవారే తిరుమలకు రండి
– భక్తులకు టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి విజ్ఞప్తి
తిరుమల 23 డిసెంబరు 2020: వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మరో మారు విజ్ఞప్తి చేశారు.
అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలసి బుధవారం ఆయన వైకుంఠం క్యూ కంప్లెక్స్ 1, 2 ఏటీసీ సర్కిల్, సుపథం, రూ 300 టికెట్ ప్రవేశ మార్గాలను పరిశీలించారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం చేసిన ఏర్పాట్లను చూసి అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు గాను రూ 300 టికెట్లు 2 లక్షలు ఆన్లైన్లో విడుదల చేశామన్నారు. తిరుపతిలో స్థానికులకు మాత్రమే 24వ తేదీన రోజుకు 10 వేల చొప్పున 10 రోజులకు లక్ష సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి టోల్ గేట్, నడక మార్గాల్లో అనుమతిస్తామని ఈవో స్పష్టం చేశారు.
సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, సిఈ శ్రీ రమేష్ రెడ్డి, తిరుమల ఆలయ డిప్యూటి ఈవో శ్రీ హరీంద్ర నాథ్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది