భక్తులపై లాఠీచార్జి అవాస్తవం – ఆ డ్రోన్ కెమెరాలను సీజ్ చేశాం టీటీడీ

భక్తులపై లాఠీచార్జి అవాస్తవం – ఆ డ్రోన్ కెమెరాలను సీజ్ చేశాం టీటీడీ

తిరుమల 23 డిసెంబరు 2020: అలిపిరి టోల్ గేట్ వద్ద భక్తులపై టీటీడీ పోలీసులతో లాఠీ చార్జి చేయించిందని ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు సామాజిక మీడియా ద్వారా చేసిన ఆరోపణలు అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది. దర్శనం టోకెన్లు లేని భక్తులు టోల్ గేట్ వద్దకు రాగా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు వారికి సర్ది చెప్పి పంపారని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో టోకెన్లు, టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించబోమని చాలా రోజుల నుంచి ప్రచార, ప్రసార సాధనాల్లో భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తూనే ఉంది.

అన్నమయ్య మార్గంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటి అమరనాథ రెడ్డి తో పాటు వస్తున్న వారు పాప వినాశనం అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు, వీడియో తీస్తున్నారని సమాచారం అందగానే విజిలెన్స్ అధికారులు వెళ్లి వాటిని సీజ్ చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది