SOMASKANDAMURTHY ON TIRUCHI _ తిరుచ్చిపై సోమస్కందమూర్తి

Tirupati, 8 Mar. 21: On the fifth day morning, Sri Somaskandamurthy appeared on Tiruchi.

On Monday morning as part of the ongoing annual brahmotsavams in Sri Kapileswaraswamy temple Sri Somaskandamurthy blessed devotees on Tiruchi.

DyEO Sri Subramanyam and others were present in this Ekanta vahana seva.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

తిరుపతి, 2021 మార్చి 08: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

శివచింతన కోసం కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేస్తున్నారు. మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి తపమాచరిస్తున్నారు. ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో ఒంటికాలి మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ తమ చిత్తసరోజాలను పరమేశ్వరార్పణ చేయడానికే. కానీ మహాదేవుడైన కపిలేశ్వరస్వామికి బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల చిత్తం అయత్నంగా పరమశివ పదాయత్తమవుతుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.