SURYANARAYANA ENSHRINES ON SURYAPRABHA _ సూర్యప్రభ వాహ‌నంపై సూర్యనారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న

Tirupati, 8 Mar. 21: In His resplendence, decked as Surya Narayanamurty, the professional deity of the Kalyana Venkateswara Swamy took celestial ride on Suryaprabha vahanam all Monday morning in the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram.

Surya Deva is considered as the Pratyaksha Daivam. With His unparalleled energies, He provides life to all the living organisms on earth.

Vedas revered Surya Bhagavan as equal to Sri Maha Vishnu as He is the ultimate protector of the entire universe.

To propel the same, Sri Kalyana Venkateswara donned as Vishnumurty in Suryamandala to bless His devotees.

DyEO Smt Shanti and others were present in this Vahana Seva which was held in Ekantham in view of Covid guidelines.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సూర్యప్రభ వాహ‌నంపై సూర్యనారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న

తిరుపతి, 2021 మార్చి 08: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు సూర్యనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.