GOPUJA & VEDA ASHIRVACHANAM IN ALL TTD TEMPLES- TTD EO _ అన్ని ఆలయాల్లో గోపూజ, వేద ఆశీర్వచనం – టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి

Tirupati,15 September 2021:  TTD Executive Officer Dr KS Jawahar Reddy has directed officials to henceforth perform Go puja and Veda Ashirvachanam to devotees in all TTD local temples.

 

Addressing a review meeting with DyEOs of all temples and senior officials on Wednesday evening at Sri Padmavati Rest House in Tirupati, the EO said, special sevas should be launched at all temples taken over by TTD.

 

He wanted officials to launch Sri Kalahasti and Varanasi type sevas at Kapilathirtham temple also and frame rules and regulations for conducting utsavas in temples.

 

He said in consultation with Tourism department package buses shall be organised for the benefit of devotees coming from far off places.

 

Later he directed the officials to issue notifications for utilising the unused land assets of such temples and lease surplus lands to farmers to grow organic crops.

 

Among others TTD EO urged officials to organise devotee friendly sign boards, publicise through promos on SVBC and also publish small booklets about history, significance of such temples besides updating all the information relating to these temples on TTD website.

 

TTD officials made a power point presentation on devotee footfall in each temple, Sevas and ongoing engineering works done in all sub temples.

 

JEO Smt Sada Bhargavi, FA& CAO Sri Balaji, CE Sri Nageswara Rao, DyEOs (general) Sri Ramana Prasad, Estate Officer Sri Mallikarjun, DyEOs of other temples Smt Shanti, Smt Parvati, Smt Kasturi Bai were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్ని ఆలయాల్లో గోపూజ, వేద ఆశీర్వచనం- టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి
 
 
తిరుపతి 15 సెప్టెంబరు 2021: టీటీడీ స్థానికాలయాలు, టీటీడీ ఆధీనం లోకి వచ్చిన ఆలయాల్లో  భక్తులు గోపూజ,వేద ఆశీర్వచనం చేసుకునే అవకాశం కల్పించాలని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.
 
     
 శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం సాయంత్రం ఈ ఆలయాల అభివృద్ధి పై సీనియర్ అధికారులు, ఆయా ఆలయాల డిప్యూటి ఈవో లతో ఈవో సమీక్ష నిర్వహించారు.
 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  స్థానికాలయాలు, స్వాధీనం చేసుకున్న ప్రతి ఆలయంలో ఒక ప్రత్యేక సేవ ప్రారంభించాలన్నారు. కపిల తీర్థంలో వారణాసి, శ్రీ కాళహస్తి ఆలయాల తరహాలో సేవలు ప్రవేశ పెట్టాలని చెప్పారు. ప్రతి ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా విధి, విధానాలు రూపొందించాలన్నారు. టూరిజం అధికారులతో మాట్లాడి ఈ ఆలయాలకు ప్యాకేజి బస్ లు నడిపేలా చేస్తే సుదూర ప్రాంతాల భక్తులు కూడా సందర్శిస్తారన్నారు. 
 
 
ఆయా ఆలయాలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న భూములను లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పారు. మిగిలిన భూములు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు లీజుకు ఇవ్వవచ్చునని ఈవో తెలిపారు.
 
 
ప్రతి ఆలయానికి భక్తులు సులభంగా వెళ్లేందుకు వీలుగా అవసరమైన బోర్డ్ లు,ఎస్వీబీసీ లో ప్రోమోలు, చిన్న సైజు పుస్తకాలు ముద్రించాలని సూచించారు.
   
 
ప్రతి ఆలయానికి సంబంధించిన సమాచారం టీటీడీ వెబ్సైట్ లో పొందుపరచాలని ఈవో చెప్పారు. ఆలయాలకు వచ్చిన భక్తుల సంఖ్య, సేవలు, ఇంజినీరింగ్ పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
   
 
జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సి ఏవో  శ్రీ బాలాజి , చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డిప్యూటి ఈవో జనరల్ శ్రీ రమణ ప్రసాద్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లి ఖార్జున,   వివిధ ఆలయాల డిప్యూటీ ఈవో లు శ్రీమతి శాంతి, శ్రీమతి పార్వతి, శ్రీమతి కస్తూరి బాయి పాల్గొన్నారు.
 
 
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది