ANKURARPANAM PERFORMED _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUPATI, 15 SEPTEMBER 2021:  Ankurarpanam fete for annual Pavitrotsavams was performed in Sri Govindaraja Swamy temple on Wednesday evening.

 

As part of the ritual, Senadhipathi Utsavam was performed in the evening followed by Ankurarpanam or Beejavapanam amidst chanting of Vedic hymns.

 

On September 16 on first day of Pavitrotsavams, Pavitra Pratista will be performed with Yagashala Karyakramams in the evening. On second day on September 17 Pavitra Samarpana and on September 18 Pavitra Purnahuti will be performed.

 

During Beejavapanam on Wednesday, Special Grade DyEO of the temple Sri Rajendrudu and other temple officials and archakas were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 15: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 16 నుండి 18వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికుల‌కు విధులు కేటాయించి వ‌స్త్రస‌మ‌ర్ప‌ణ చేశారు. సాయంత్రం ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 16న ఉదయం పవిత్రప్రతిష్ట‌, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 17న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 18న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.