PAVITRA SAMARPANA HELD IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Tirupati, 17 September 2021: As part of the annual Pavitrotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati, Pavitra Samarpana held on Friday.

 

Senior and Junior Pontiffs of Tirumala, Special Grade DyEO Sri Rajendrudu and other officials present in the fete held in Ekantam due to Covid norms.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 17: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.

ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉద‌యం 10.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, ప‌సుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు.

అనంతరం మూలవర్లకు, బాలాల‌యంలోని స్వామివారి మూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌ స్వామి, ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.