TTD RESUMES LOWER CLASSES IN TIRUMALA SV HIGH SCHOOL _ ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో ప్లే క్లాస్ తరగతులు ప్రారంభం : జెఈఓ శ్రీమతి సదా భార్గవి

Tirumala, 17 September 2021: Upon the request of Tirumala residents and under the directives of TTD EO Dr KS Jawahar Reddy, the lower classes have been resumed in TTD-run SV High School at Tirumala on Friday, said TTD JEO Smt Sada Bhargavi.

 

In connection with the resumption of classes, the JEO inspected the SV High School at Tirumala on Friday along with Devasthanam Education Officer Sri C Govindarajan.

 

Speaking on the occasion she said it was brought to the notice of TTD authorities that the Tirumala locals have been facing difficulties in sending their children to lower classes to the schools in Tirupati during the pandemic and hence the lower classes were begun at the SV high school.

 

She also inspected the quality of food being served to the students in Mid Day meals. The JEO also instructed the Head Master Sri Krishnamurthy to improve facilities after holding a meeting the with the parents of the pupils. Later she interacted with the parents who expressed their satisfaction over the amenities being provided by TTD to their children.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో ప్లే క్లాస్ తరగతులు ప్రారంభం : జెఈఓ శ్రీమతి సదా భార్గవి

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 17: తిరుమల స్థానికుల విజ్ఞప్తి మేరకు టిటిడి ఈఓ ఆదేశాల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో ప్లే క్లాస్ తరగతులు ప్రారంభించినట్టు జెఈఓ శ్రీమతి సదా భార్గవి తెలిపారు.

ఈ మేరకు జెఈఓ శుక్రవారం పాఠశాలను సందర్శించి ప్లే క్లాస్ తరగతుల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్థానికులు వారి పిల్లలను పూర్వ ప్రాథమిక విద్య కోసం తిరుపతికి పంపించలేక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమల ఎస్వీ పాఠశాలలోనే ఈ తరగతులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టామన్నారు.

అనంతరం భోజనం నాణ్యతను పరిశీలించారు. త్వరలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి కావాల్సిన వసతులపై చర్చించాలని హెచ్ఎంకు సూచించారు. అనంతరం ఆమె విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న వసతులు, విద్య గురించి చర్చించగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిఈఓ శ్రీ గోవిందరాజన్, పాఠశాల హెచ్ఎం శ్రీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.