STATE FESTIVAL LIKE NEVER BEFORE AT VONTIMITTA -TTD CHAIRMAN _ ఏప్రిల్ 15న రెండు లక్షల మందితో ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం
VONTIMITTA, 01 APRIL 2022: The annual Brahmotsavam in Sri Kodanda Rama Swamy temple at Vontimitta in YSR Kadapa District will be observed from April 10-18 in a grand manner under the instructions of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy said TTD Chairman Sri YV Subba Reddy.
The TTD Board Chief after inaugurating the PAC speaking to media persons said, the state festival of Sri Sita Rama Kalyanam will be observed in a big way on April 15 to which nearly two lakh devotees are being anticipated. ‘CM of AP will take part in this ceremonious fete. TTD is making elaborate arrangements for big fete this year as we have not conducted the celestial marriage in the last two years due to Covid Pandemic. So with the support of local administration, local MLA Sri Meda Mallikarjuna Reddy, ZP Chief Sri Amarnath Reddy, local police.
For the sake of devotees today we have commenced a PAC, a rest house for VIPs stay at a cost if Rs. 4.3cr.
At 108 feet Annamaiah statue in Tallapaka, a temple for Sri Venkateswara Swamy will also be constructed and Dhoopa, Deepa, Naivedyam will be offered. Henceforth every day Annamaiah Sankeertans will be rendered at Annamaiah Pranganam, he added.
Later the TTD Chairman also released the Vontimitta Brahmotsavam posters.
JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, VGO Sri Manohar, DyEOs Sri Gunabhushan Reddy, Sri Ramana Prasad, Sri Lakshman Naik, SVETA Director Smt Prasanti and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 15న రెండు లక్షల మందితో ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం
– ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు
– భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి 1 ఏప్రిల్ 2022: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున అదేరోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు కావచ్చునని అంచనా వేశామని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఒంటిమిట్టలో టీటీడీ నిర్మించిన ఆలయ కార్యాలయాల సముదాయం, అతిథి గృహం, యాత్రీకుల వసతి సముదాయాలను జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ అమర నాథ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ మల్లి ఖార్జున రెడ్డి తో కలసి శుక్రవారం శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. శ్రీ కోదండ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వైవి సుబ్బారెడ్డి కి సాంప్రదాయంగా స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్, కర పత్రాలను ఆవిష్కరించారు.అనంతరం కల్యాణ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కారణంగా రెండేళ్ళుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రకృతి ఇబ్బందులు తలెత్తినా భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా కల్యాణం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం టీటీడీ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రూ 63 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామన్నారు. అవసరమైన మేరకు నిధులు వెచ్చించి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.
రూ 4. 3 కోట్లతో నిర్మించిన భక్తుల వసతి సముదాయం, కార్యాలయాల సముదాయం, అతిథి గృహం శుక్రవారం ప్రారంభించామన్నారు.
ఈ కార్యక్రమాల్లో టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటి ఈవో శ్రీ రమణ ప్రసాద్, విజిఓ శ్రీ మనోహర్ ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.